'లోకేష్‌ బ్రోకర్‌ పనులు.. కిలాడీ లేడీతో మైండ్‌గేమ్‌'

AP Viswabrahmin Corporation Chairman Fires on Nara lokesh - Sakshi

సెటిల్‌ చేసుకోవాలంటూ టీడీపీ నాయకుడిని పంపిస్తావా? 

రాజకీయాలు మాని బ్రోకర్‌ పనులు చేసుకో 

ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ తోలేటి శ్రీకాంత్‌ 

సాక్షి, విజయవాడ: నిరాధార ఆరోపణలు చేస్తూ బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడుతున్న కిలాడీ లేడీ గేమ్‌కు కెప్టెన్‌ నారా లోకేషేనని ఏపీ విశ్వబ్రాహ్మణ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ తోలేటి శ్రీకాంత్‌ పేర్కొన్నారు. వివిధ మోసాలకు పాల్పడి తెలుగు రాష్ట్రాలలో సుమారు 10 కేసులలో ముద్దాయి అయిన మహిళకు టీడీపీకి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఒక వైపు తనపై అసత్య ఆరోపణలు చేయిస్తూ మరో వైపు మహిళతో సెటిల్‌ చేసుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముజఫర్‌ బేగ్‌ను అర్ధరాత్రి తన ఇంటికి పంపించి రాయబారాలు జరపాల్సిన అవసరం ఏమొచ్చింది.

ముజఫర్‌ బేగ్‌కు మీ పార్టీకి సంబంధం లేదని చెప్పగలవా లోకేష్‌? కిలాడీ లేడీ తో ఆడిస్తున్న మైండ్‌ గేమ్‌కు కెప్టెన్‌ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేషేనని స్పష్టం చేశారు. మరోసారి ఇటువంటి క్రైమ్‌ గేమ్‌లు ఆడితే బీసీలంతా కలిసి మీ బాబూ కొడుకులను ఆంధ్రా నుంచి  తరిమి కొడాతారని అంటూ హెచ్చరించారు.  సాయికుమారి అలియాస్‌ స్రవంతి అలియాస్‌ భవ్య అనే మహిళ శ్రీకాంత్‌ తనను మోసం చేశాడంటూ ఇటీవల ప్రెస్‌మీట్‌ పెట్టి చెప్పటమే కాకుండా సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేయటాన్ని ఆయన ఖండిస్తూ మంగళవారం విజయవాడ రూరల్‌ మండలం గొల్లపూడిలోని బీసీ సంక్షేమ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు విషయాలను వెల్లడించారు.

ముజఫర్‌ బేగ్‌ చెబుతున్న మాటలను బట్టి మోసగత్తె మహిళ వెనుక టీమ్‌కు నాయకుడు లోకేషేనని అర్ధం అవుతుందన్నారు. బీసీలంటే చంద్రబాబుకు, లోకేష్‌లకు ఎందుకంత కక్ష అని ప్రశ్నించారు. పుష్కరాల పేరుతో విజయవాడలో విశ్వబ్రాహ్మణుల కర్మల భవనాన్ని, బ్రహ్మంగారి గుడిని కూల్చేసిన దుర్మార్గుడు చంద్రబాబన్నారు. హైదరాబాద్‌లో ఓటుకు కోట్ల కేసులో అడ్డంగా బుక్కయితే కేసీఆర్‌ తన్నిన తన్నుకు మీ బాబు చంద్రబాబు వచ్చి ఆంధ్రాలో పడ్డాడని, మనకు రావల్సిన 10 ఏళ్ల రాజధానిని వదిలేసి ఆంధ్రప్రదేశ్‌ పరువు తీశాడని మండిపడ్డారు. లోకేష్‌ రాజకీయాలు మానుకుని తాను ఏర్పాటు చేసుకున్న క్రిమినల్‌ టీమ్‌తో బ్రోకర్‌ పనులు చేసుకోవాలని ఎద్దేవా చేశారు.  

చదవండి: (తనతో ఎలాంటి సంబంధం లేదు.. ఇది వారి కుట్రే: తోలేటి శ్రీకాంత్‌)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top