హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ నియామాకాలను చేపట్టింది హైకమాండ్ ఏఐసీసీ. ఈ మేరకు 36 మందిని డీసీసీ అధ్యక్షులుగా నియమించింది. ఇందులో పలువురు ఎమ్మెల్యేలక డీసీసీ పగ్గాలు అప్పచెప్పింది. కాగా, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా లలకు డీసీసీలను ఏఐసీసీ ప్రకటించలేదు.
ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్యకు యాదాద్రి డీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు అప్పచెప్పిన ఏఐసీసీ.., నాగర్‌కర్నూల్ డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే వంశీ, నిర్మల్ డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే బొజ్జు, పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌లను నియమించింది.
పలు డీసీసీ అధ్యక్షుల వివరాలు ఇలా..
- ఆదిలాబాద్-నరేష్ జాదవ్
- అసిపాబాద్-ఆత్రం సుగుణ
- బడ్డాద్రి కొత్తగూడెం-తోట దేవి ప్రసన్న
- భువనగిరి-బీర్ల ఆయిలయ్య(ప్రభుత్వ విప్)
- గద్వాల్-m రాజీవ్ రెడ్డి
- హన్మ కొండ-ఇనగాల వెంకట్ రామిరెడ్డి(కార్పోరేషన్ ఛైర్మన్)
- జగిత్యాల-జి.నన్నయ్య
- జనగామ-లకవత్ ధన్వంతి
- జయశంకర్ భూపాల్ పల్లి-బట్టు కరుణాకర్
- కరీంనగర్-మేడిపల్లి సత్యం(ఎమ్మెల్యే)
- కమారెడ్డి-మల్లికార్జున్ ఆలే
- కరీంనగర్ కార్పొరేషన్-అంజన్ కుమార్
- ఖైరతాబాద్-మోత రోహిత్
- ఖమ్మం-ఎన్. సత్యనారాయణ


