
బహుభాష నటి నమిత ఆదివారం నగరంలోని చిక్కపేటలో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేసింది.
బొమ్మనహళ్లి: కన్నడ ఎన్నికల ప్రచారంలో అందాల తారల సందడి ఆలస్యంగానైనా ఆరంభమైంది. బహుభాష నటి నమిత ఆదివారం నగరంలోని చిక్కపేటలో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేసింది. నమితను చూడడానికి జనం పెద్దసంఖ్యలో వచ్చారు. వాహనంపై నిలబడి చేయి ఊపుతూ స్థానిక బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేసింది.