గోదావరిఖని: గతంతో పోల్చితే సింగరేణి గత ఆర్థిక సంవత్సరం సాధించిన లాభాలు తగ్గాయి. మొత్తం రూ.1,750కోట్ల లాభాలు ఆర్జించగా అందులో 34 శాతం కార్మికులకు వాటాగా రూ.596 కోట్లు చెల్లిస్తా మని ప్రకటించింది. 38,737 మంది పర్మినెంట్ కా ర్మికులకు 34శాతం, 29,717 మంది కాంట్రాక్టు కా ర్మికులకు గతేడాది మాదిరిగానే రూ.5,500 చొప్పున చెల్లించాలని నిర్ణయించింది. లాభాలు, వాటాపై కార్మికులు పెదవి విరుస్తున్నారు.
2024–25లో భారీ లాభాలు
2024–25 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి అత్య ధికంగా రూ.6,394 కోట్ల లాభాలు సాధించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో సంస్థ విస్తరణకు రూ.4,034 కోట్లు కేటాయించగా, మిగిలిన రూ.2,360 కోట్లలో కార్మిక సంక్షేమానికి మరికొన్ని నిధులు కేటాయించారు. అదేఏడాది కార్మికులకు 34శాతం లాభాల వాటా కింద రూ.819 కోట్లు అందించారు. ఒక్కో కార్మికుడికి అత్యధికంగా రూ.1,95,610 చొప్పున చెల్లించినట్లు యాజమాన్యం పేర్కొంది. 2023–24లో రూ. 4,701 కోట్ల నికర లాభం సాధించగా.. సంస్థ విస్తరణ, పెట్టు బడు లకు రూ.2,289 కోట్లు కేటాయించగా.. మిగిలిన రూ.2,412 కోట్లలో రూ.796 కోట్లను కార్మికుల బోనస్‌గా ప్రకటించింది. ఒక్కో పర్మినెంట్ కార్మికుడికి రూ.1.90 లక్షలు చెల్లించింది.
ఈసారి కూడా..
2025–26 ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.1,750 కోట్లుగా ప్రకటించారు. ఇందులో 34శాతం వాటాగా రూ.596కోట్లు కార్మికులకు అందజేయనున్నారు. కాంట్రాక్టు కార్మికులకు కూడా రూ.5,500 చొప్పున బోనస్ అందజేయాలని నిర్ణయించారు. గతేడాదిలాగే చెల్లింపులు ఉండటంతో కార్మికులు ఒకింత అసంతృప్తికి లోనవుతున్నారు.
మిగతా సమస్యల పరిష్కారానికి ఆదేశం
సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. సొంతింటికల, జీవో–76 ప్రకారం సింగరేణి ఇళ్ల స్థలాలకు పట్టాలివ్వడం, పెండింగ్‌లోని డిపెండెంట్లకు 15రోజుల్లో ఉద్యోగాలివ్వాలని సూ చించారు. మారుపేర్ల కార్మికుల డిపెండెంట్లకు త్వర గా ఉద్యోగాలిచ్చేలా నిర్ణయం తీసుకోవాలన్నారు. ఏరియా ఆస్పత్రుల్లో మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి ఇన్వాలిడేషన్ ప్రక్రియ సులభతరం చేయడం, గైర్హాజర్ కార్మికులను వన్‌టైం సెటిల్మెంట్ కింద ఉద్యోగాల్లో తీసుకోవాలని సూచించారు. పెర్క్స్‌పై కూడా ఇన్‌కంట్యాక్స్ యాజమాన్యం చెల్లించేలా అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశాలిచ్చారు.
గతంకన్నా తగ్గిన లాభాలు
రూ.1750 కోట్లుగా ప్రకటించిన ప్రభుత్వం
38వేల మంది పర్మినెంట్ కార్మికులకు ప్రయోజనం
కాంట్రాక్టు కార్మికులకు కూడా రూ.5,500 చొప్పున చెల్లింపు
అపరిష్కృత సమస్యల పరిషారానికి సర్కార్ గ్రీన్‌సిగ్నల్
ఏడాది లాభాలు వాటా చెల్లించింది చెల్లించిన (రూ.కోట్లలో) (శాతం) (రూ.కోట్లలో) తేదీ
2015–16 1066.13 23 245.20 07–10–16
2016–17 395.38 25 98.84 29–09–17
2017–18 1212.75 27 327.27 29–08–18
2018–19 1766.00 28 493.00 04–10–19
2019–20 993.00 28 278.04 14–10–20
2020–21 272.20 29 79.06 11–10–21
2021–22 1,227.00 30 368.00 10–10–22
2022–23 2222.00 32 711.00 22–10–23
2023–24 2388.50 33 788.20 20–09–24
2024–25 6,394.0 34 802.40 22–09–25
2025–26 1,754.0 34 596.00 13–10–26


