నైపుణ్యంతో సైబర్‌ నేరాల నియంత్రణ | - | Sakshi
Sakshi News home page

నైపుణ్యంతో సైబర్‌ నేరాల నియంత్రణ

Oct 14 2026 4:11 AM | Updated on Oct 14 2026 4:11 AM

జ్యోతినగర్‌: సాంకేతిక పరిజ్ఞానంతోనే సైబర్‌ నేరాల నివారణ సాధ్యమని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా అన్నారు. ఎన్టీపీసీ ఉద్యోగ వికాస కేంద్రంలో ఉద్యోగులు, అధికారులకు సైబర్‌ నేరాలు, ఆన్‌లైన్‌ మోసాలు, సోషల్‌ మీడియా వినియోగంపై మంగళవారం అవగాహన కల్పించారు. పెద్దపల్లి జోన్‌, రామగుండం సర్కిల్‌, ఎన్టీపీసీ పోలీసులు, రామగుండం సైబర్‌ క్రైమ్‌ పోలీసుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. సీపీతోపాటు ఎన్టీపీసీ ఈడీ ఫయాజ్‌ తయ్యబ్‌, పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సీపీ మాట్లాడుతూ, ఎన్టీపీసీ, పోలీసుల సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలన్నారు. అధిక వేతనాలు, ఆకర్షణీయమైన ఉద్యోగాల పేరుతో యువతను ప్రలోభపెట్టి సైబర్‌ నేరా ల వైపు మళ్లిస్తున్నారని, వీటిపై జాగ్రత్తగా ఉండాలన్నారు. సందేహాస్పద సందేశాలు, లింక్‌లు, ఫోన్‌కాల్స్‌, డబ్బు బదిలీ అభ్యర్థనలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి సందేశం వచ్చి నా తొందరపడి స్పందించకుండా ‘ఆగండి.. ఆలోచించండి.. నిర్ధారించుకోండి’ సూత్రాన్ని పాటించాలని కోరారు. గోదావరిఖని, సీసీపీఎస్‌ ఏసీపీలు రమేశ్‌, రంగారెడ్డి, రామగుండం సీఐ కృష్ణకుమార్‌, ఎన్టీపీసీ ఎస్సై వెంకటస్వామి పాల్గొన్నారు.

రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement