సన్నాల ధ్రువీకరణకు వలంటీర్లు | - | Sakshi
Sakshi News home page

సన్నాల ధ్రువీకరణకు వలంటీర్లు

Oct 14 2026 4:11 AM | Updated on Oct 14 2026 4:11 AM

మంథనిరూరల్‌: సన్నరకం ధాన్యం క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ చెల్లింపులు పారదర్శకంగా జరిగేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం సన్నరకమేనా? కాదా? అని గుర్తించేందుకు వలంటీర్లను నియమించనుంది. గతేడాది గ్రెయిన్‌ క్యాలీఫర్‌ అనే ఆధునిక పరికరంతో సన్నాలను గుర్తించగా సాంకేతిక సమస్యలు తలెత్తాయి. రైతులు నష్టపోయారు. దీనిని అధిగమించేందుకు ఈసారి వలలంటీర్లను నియమించేందుకు సిద్ధమైంది. ఒక్కో కొనుగోలు కేంద్రానికి ఒకరిని నియమించాలని సర్కారు ఇటీవల ఆదేశాలు జారీచేసింది. దీంతో జిల్లా వ్యవసాయాధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు.

334 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

గతేడాది వానాకాలం, ఈ ఏడాది యాసంగిలో జిల్లాలోని 14 మండలాలో ఐకేపీ, పీఏసీఎస్‌, డీసీఎంఎస్‌ల ద్వారా 334 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరించారు. ఈసారి ప్రభుత్వం ప్రకటించిన ఏడు సన్నరకాలల్లో ప్రతీ కేంద్రానికి వచ్చే ధాన్యంలో సన్నరకం గుర్తించి రైతుకు బోనస్‌ చెల్లించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈసీజన్‌లో జిల్లావ్యాప్తంగా 1.15లక్షల ఎకరాల్లో సన్నరకం వరి సాగు చేసినట్లు అధికారులు తెలిపారు.

వలంటీర్లకు ప్రత్యేక శిక్షణ

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సన్నరకాలను గుర్తించేందుకు వలంటీర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిసింది. గతంలో ధాన్యంలో పిడికెడు ప్యాడీ పా స్కల్‌లో పోసి తిప్పితే ధాన్యంపై పొట్టు ఊడి బి య్యంగా మారాయి. ఇందులో ఒక బియ్యపు గింజ ను తీసుకుని పరికరంతో వేస్తే గింజ వెడల్పు, పొ డవును చూపిస్తుంది. పొడవు, వెడల్పు ఆధారంగా సన్నరకాలుగా గుర్తించారు. ఇందులో కొన్ని సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కావడంతో ప్రత్యామ్నా యంగా వలంటీర్లను నియమించనున్నారు.

ఎంపిక చేస్తున్నాం

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈసారి ప్రతీ కొనుగోలు కేంద్రానికి ఒక వలటీర్‌ను నియమిస్తాం. సహకార సంఘాల ద్వారా ఎంపిక చేపట్టాం. వారి అధీనంలోనే వలంటీర్లు పనిచేయాలి.

– నవ్య, మండల వ్యవసాయాధికారి, మంథని

ప్రతీ కొనుగోలు కేంద్రానికి ఒకరు చొప్పున నియామకం

పారదర్శకంగా రూ.500 బోనస్‌ చెల్లింపులకు ఏర్పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement