ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పంటలు ఎండిపోకుండా ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నం. నీటి విడుదలకు సహకరించిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు కృతజ్ఞతలు.
– విజయరమణారావు, ప్రభుత్వ విప్
పొట్ట దశలో పంటకు రక్షణ
వరి పొట్ట దశకు చేరింది. పంటలు ఎండిపోతుండడంతో అందరం కలిసి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాం. వెంటనే స్పందించిన ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నీళ్లు వచ్చేలా చేశారు. ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు.
– రాజిరెడ్డి, రైతు, కొమిరె, ఓదెల


