హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం | - | Sakshi
Sakshi News home page

హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం

Oct 11 2026 11:43 PM | Updated on Oct 11 2026 11:43 PM

గోదావరిఖని: ప్రజలు, సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్‌ పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్‌ విమర్శించారు. ఆదివారం రాత్రి శ్రీలక్ష్మిగార్డెన్‌లో జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్‌, బాల్క సుమన్‌తో కలిసి సింగరేణి కార్మిక గర్జన‘ బహిరంగ సభ పోస్టర్‌ ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఈనెల14న సాయంత్రం స్థానిక సింగరేణి మైదానంలో నిర్వహించే ‘సింగరేణి కార్మిక గర్జన’ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో హాజరు కావాలన్నారు. కేసీఆర్‌ హయంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. సింగరేణి సంస్థ పూర్తిగా నిర్వీర్యమయ్యే పరిస్థితికి చేరుకోవడానికి ప్రస్తుత ప్రభుత్వ విధానా లే కారణమన్నారు. సింగరేణిలో ఇప్పటికే రూ.10 వేల కోట్ల కుంభకోణాలు జరిగాయని, కుందారం ఓపెన్‌కాస్ట్‌ టెండర్లు, సైట్‌ విజిట్‌ సర్టిఫికెట్లు, కాంట్రాక్ట్‌ పనులతో సంస్థను దెబ్బతీశారన్నారు. ప్ర స్తుతం బొగ్గు ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయిందన్నారు. టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, గ్రంథాలయ మాజీ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, నా యకులు కౌశిక్‌హరి, వ్యాళ్ళ హరీశ్‌రెడ్డి, పీటీ స్వా మి, కొంకటి లక్ష్మీనారాయణ, ఆముల నారాయణ, మేకల సమ్మయ్య, దామోదర్‌రావు పాల్గొన్నారు.

మాజీ మంత్రి, టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement