జూలపల్లి(పెద్దపల్లి): గ్రామీణ యువత క్రీడల్లో నైపుణ్యం పెంచుకొని ఉన్నత లక్ష్యం సాధించాలని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు సూచించారు. ఆదివారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో చింతకుంట సుధాకర్‌రావు స్మారక ఎలిగేడు, జూలపల్లి మండలాల స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభించారు. యువత చదువుతో పాటు ఆటల్లో లక్ష్యం సాధించేందుకు తగిన సాధన చేయాలని, తనవంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు.
నీటిని పొదుపుగా వాడుకోవాలి
రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం, వారి పంటలను కాపాడేందుకు ఎస్సారెస్పీ నీటిని అందిస్తున్నట్లు విప్ విజయరమణారావు తెలిపారు. డీ–83, డీ–86 కాలువల కింద ఉన్న పంటలకు చివరి తడి ఇచ్చి కాపాడేందుకు చర్యలు తీసుకున్నట్లు, రైతులు కాలువ నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. పీఏసీఎస్ చైర్మన్లు లోక జలపతిరెడ్డి, వేణుగోపాలరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మ పోచాలు, వైస్ చైర్మన్ కందుకూరి అంజయ్య, సర్పంచులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ విజయరమణారావు


