ఆరోగ్యంతోనే ఉజ్వల భవిష్యత్‌ | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యంతోనే ఉజ్వల భవిష్యత్‌

Oct 11 2026 11:43 PM | Updated on Oct 11 2026 11:43 PM

పెద్దపల్లి: యువత క్రీడలతో పాటు కెరీర్‌లో ఉన్నతస్థాయికి ఎదగాలని బీఆర్‌ఎస్‌ నాయకురాలు, బీసీ జేఏసీ జిల్లా చైర్‌పర్సన్‌ దాసరి ఉష పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా ఆవిర్భవించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమ నేత సి.సత్యనారాయణరెడ్డితో కలిసి 5కే రన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యువతలో ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పించేందుకు ఫిట్‌ అండ్‌ ఫ్యూచర్‌ క్లబ్‌ ప్రారంభించినట్లు తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంలోని సుమారు 54 గ్రామాల్లో యువతతో కలిసి మార్నింగ్‌ వాక్‌, రన్నింగ్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. పదేళ్లలో పెద్దపల్లిలో మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి, కలెక్టరేట్‌, మినీ ట్యాంక్‌బండ్‌ తదితర మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తే అద్భుతాలు సృష్టించగలరని, గతంలో డేటా సైన్స్‌ శిక్షణ పొందిన సుమారు 120 మంది ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడం ఇందుకు నిదర్శనమన్నారు. బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్‌, నాయకులు పడాల సతీశ్‌, శ్రీధర్‌, క్లబ్‌ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement