జ్యోతినగర్: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటో తు హుస్సేన్ నాయక్ మంగళవారం రాత్రి రామగుండంలోని ఎన్టీపీసీ జ్యోతి భవన్‌కు చేరుకున్నారు. పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి, తహసీల్దార్ రవీందర్‌రావు ఆయనకు ఘనస్వాగతం పలికారు. జాటోతు హు స్సేన్ ఈనెల 16న యైటింక్లయిన్ కాలనీ లంబాడి తండా సందర్శించి గిరిజనుల సమస్యలను తెలుసుకోనున్నారు. కలెక్టర్, ఎస్పీ, డీఎఫ్‌వో తదితర అధికారులతో సమీక్షిస్తారు. 17న ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం మహబూబాబాద్‌కు బయలుదేరి వెళ్తారు. గిరిజనుల స మస్యలు, ప్రాజెక్టుల్లో అమలవుతున్న సంక్షేమ, సా మాజిక బాధ్యతతలపై ఆరా తీసే అవకాశం ఉంది.


