గోదావరిఖని: నేరస్తులను పట్టుకోవడంలో ఆధునిక సాంకేతికతను వినియోగించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. మంగళవారం నేరసమీక్ష సమావేశం సీపీ కార్యాలయంలో నిర్వహించారు. పెండింగ్‌కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు. నిందితుల అరెస్టులు, దర్యాప్తులో ఉన్న కేసులు, వారెంట్ల అమలు, పోలీస్ సిబ్బంది పనితీరును సమగ్రంగా సమీక్షించారు. బాధితులకు న్యాయం త్వరితగతిన అందేలా న్యాయాధికారులతో సమన్వయం పాటించాలని అన్నారు. చోరీలకు పాల్పడే వారిపై హిస్టరీ షీట్లు తెరవాలని, చోరీలు జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. మంచిర్యాల, పెద్దపల్లి డీసీపీలు భాస్కర్, రామ్‌రెడ్డి, అడిషనల్ డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, గోదావరిఖని, మంచిర్యాల, జైపూర్, బెల్లంపల్లి, స్పెషల్ బ్రాంచ్, ట్రాఫిక్ ఏసీపీలు రమేశ్, ప్రకాశ్, వెంకటేశ్వర్లు, కిరణ్‌కుమార్, నాగేంద్రగౌడ్, శ్రీనివాస్, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా


