
నీట్ ర్యాంకర్లకు చెక్కులు అందజేత
● సింగరేణీ జీఎం లలిత్‌కుమార్ వెల్లడి
గోదావరిఖని: నీట్‌లో ర్యాంక్ సాధించి ఎంబీబీఎస్‌లో సీటు పొందిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ చెక్కులను ఆర్జీ –వన్ జీఎం లలిత్‌కుమార్ బుధవారం అందజేశారు. జీఎం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఏరియా ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సుధాకర్ కూతురు హర్షిత నీట్‌లో స్టేట్ 2590 ర్యాంక్ సాధించింది. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న దేవాజి కూతురు వైష్ణవి స్టేట్ 3570 ర్యాంక్, స్టాఫ్‌నర్స్ టి.మణమ్మ కుమారుడు చందన్‌కుమార్ స్టేట్ 3619 ర్యాంక్ సాధించారు. ఇందులో ఒక్కొక్కరికి ఏటా రూ.16వేల చొప్పున చదువు పూర్తయ్యేంత వరకు స్కాలర్‌షిప్‌లు అందించనున్నట్లు జీఎం పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు చిలుక శ్రీనివాస్, ఆంజనేయులు, రవీందర్‌రెడ్డి, వేణు, సీనియర్ పీవోలు శ్రావణ్‌కుమార్, హన్మంతరావు తదితర అధికారులు పాల్గొన్నారు.