
మత్తు పదార్థాలతో భవిష్యత్ నాశనం చేసుకోవద్దు
పెద్దపల్లిరూరల్: డ్రగ్స్, గంజాయి లాంటి మత్తుపదార్థాలతో తమ బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా సెక్రటరీ స్వప్నరాణి అన్నారు. నశా ముక్త్ భారత్ అభియాన్ ఆధ్వర్యంలో గురువారం పెద్దపల్లిలో చేపట్టిన అవగాహన ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. ప్రతీపౌరుడు తమవంతు కృషి చేసి మాదకద్రవ్యాలను నిర్మూలించడంలో పాత్రధారులు కావాలన్నారు. గుట్టుగా సాగుతున్న మత్తు పదార్థాల క్రయవిక్రయాల సమాచారాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. విద్యార్థులతో మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేయించారు. ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ ప్రవీణ్, ఎస్సై మల్లేశ్, న్యాయవాది ఝాన్సీ, ఎఫ్‌ఆర్‌వో స్వర్ణలత, ఎడ్యుకేటర్ శ్యామల, ఉమ, స్వప్న, అరుణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
నామినేషన్ కేంద్రం పరిశీలన
కమాన్‌పూర్(మంథని): మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని గురువారం జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య పరిశీలించారు. నామినేషన్ పక్రియపై ఆర్వోలకు పలు సూచనలు చేశారు. డీపీవో వెంట మండల ప్రత్యేక అధికారి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎంపీడీవో లలిత, ఎంపీవో మారుతిలున్నారు.
ఆర్జీ–1 ఏరియా సందర్శన
గోదావరిఖని: సింగరేణి సంస్థ రామగుండం వన్ ఏరియాలో కోల్ మూమెంట్ ఈడీ వెంకన్నజాదవ్, సీఅండ్‌ఎండీ సలహాదారు ఫర్‌గైన్(ఫారెస్ట్రీ) గురువారం సందర్శించారు. జీడీకే–1, 3 గని వద్ద సర్ఫేస్ హాలర్, బంకర్, మ్యాన్ వే, బొగ్గు నాణ్యత, బొగ్గు రవాణా గుర్తించి తెలుసుకున్నారు. సెంట్రల్ నర్సరీలో మొక్కలు పెంచేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూ చించారు. ఏరియా ఆస్పత్రిని సందర్శించి రోగుల వివరాలు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారి వెంట ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్, రీజియన్ క్వాలిటీ జీఎం సూజాయిమజుందర్, గ్రూప్ ఏజెంట్ రమేశ్, ఏసీఎంవో అంబిక, ఫారెస్ట్ డీజీఎం బానోత్ కర్ణ, మేనేజర్ సుధీర్, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి, జూని యర్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ తదితరులున్నారు.
మద్యం దుకాణాలకు 3 దరఖాస్తులు
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని మద్యం దుకాణాల కోసం గురువారం 3 టెండర్లను దాఖలు చేశారని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మహిపాల్‌రెడ్డి తెలిపారు. జిల్లాలో 74 మద్యం దుకాణాల కోసం టెండర్లు స్వీకరిస్తున్నామన్నారు. గురువారం నాటికి 24 దరఖాస్తులు దాఖలయ్యాయని పేర్కొన్నారు. అందులో పెద్దపల్లి ఎకై ్సజ్‌స్టేషన్ పరిధిలో 20 దుకాణాల కోసం ఇప్పటివరకు 6 టెండర్లు వచ్చాయన్నారు. సుల్తానాబాద్ పరిధిలోని 15 దుకాణాల కోసం 6, రామగుండంలోని 24 దుకాణాల కోసం 3, మంథనిలోని 15 దుకాణాల కోసం 9 దరఖాస్తులు అందాయని వివరించారు.
రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపిక
మంథనిరూరల్: ఈనెల 10నుంచి హన్మకొండలో జరిగే రాష్ట్రస్థాయి 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ బాక్సింగ్ పోటీలకు మంథని మండలం ఎగ్లాస్‌పూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధి నారమల్ల రజిత ఎంపికై నట్లు పాఠశాల హెచ్‌ఎం జ్యోతి తెలిపారు. 48 కేజీల బాలికల విభాగంలో రజిత ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన పోటీల్లో బంగారు పతకం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై ందన్నారు. రజితను హెచ్‌ఎం జ్యోతి, పీడీ దొమ్మటి రవి, ఉపాధ్యాయులు అభినందించారు.

మత్తు పదార్థాలతో భవిష్యత్ నాశనం చేసుకోవద్దు