
మట్టిపాత్రలకు ఆదరణ లభించేనా?
మంథనిరూరల్: ప్లాస్టిక్ వినియోగంతో మట్టితో తయారు చేసే గృహోపకరణాలతోపాటు వంటపాత్రలు, ఇతరత్రా వస్తుసామగ్రికి ఆదరణ తగ్గుతోంది. సమాజం పాశ్చాత్య నాగరికతకు అలవాటు పడుతుండడం కూడా కులవృత్తులను ప్రభావితం చేస్తోందంటున్నారు. ప్రధానంగా కుమ్మరి కులవృత్తి భవిష్యత్ అగమ్య గోచరంగా తయారవుతోందని అంటున్నారు. కానీ, కొందరు యువకులు సంప్రదాయ కులవృత్తులను కాపాడుకోవడం కోసం నడుం బిగించారు.
శుభ, అశుభ కార్యాల్లో..
ప్రతీ కుటుంబంలో జరిగే శుభ, అశుభ కార్యాల్లో కుమ్మరులకు ప్రాధాన్యత ఉంటుంది. పెళ్లి జరిగినా.. లేక మరణం చోటుచేసుకున్నా మట్టితో తయారు చేసిన వస్తువులే వినియోగిస్తారు. ప్రతీపండుగకు కుమ్మరులు మట్టితో తయారుచేసిన వస్తువుల వినియోగాన్ని ఇంకా కొందరు సంప్రదాయంగా భావిస్తున్నారు. దీపావళి, శివరాత్రి, ఉగాది లాంటి పండుగలకు ప్రత్యేకంగా మట్తిపాత్రలు వినియోగించడం ఆనవాయితీ.
ప్లాస్టిక్..డిజైన్‌ల ప్రభావం...
పాస్టిక్ వస్తువుల వినియోగం, సరికొత్త డిజైన్‌ల వైపుమొగ్గు చూపడం, ఆధునిక జీవనశైలికి అవవాటు పడడంతో సంప్రదాయ వస్తువులకు ప్రాధాన్యత తగ్గుతోంది. దీంతో కుమ్మరులు తయారు చేసే వస్తువులకు డిమాండ్ తగ్గిపోతోంది.
సరిపడా ఆదాయం లేక..
ఒకప్పుడు ఎంతపనిచేస్తే అంత ఆదాయం వచ్చేదని కుమ్మరులు చెబుతున్నారు. ప్రతీఇంటిలో పనిచేసే వారు ఉండేవారని అంటున్నారు. రానురాను కుమ్మరి కులవృత్తికి ఆదరణ తగ్గుతోందని, కొందరు పనిచేసినా తగిన ఆదాయం లేదంటున్నారు. దీంతో ప్రత్యామ్యా ఉపాధి వైపు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కులవృత్తివైపు యువకుల చూపు