
మహిళల భద్రతకు మరింత భరోసా
● రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా
గోదావరిఖని: మహిళల భద్రతకు పోలీసు శాఖ మరింత భరోసా కల్పిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. గురువారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. మహిళలు, బాలికలు, విద్యార్థినుల భద్రతే లక్ష్యంగా షీటీంలు పనిచేస్తున్నాయన్నారు. కమిషనరేట్ పరిధిలో రెండు షీటీం బృందాలు చురుగ్గా పని చేస్తున్నాయని తెలిపారు. పలు ప్రదేశాలు, స్కూల్స్, కాలేజీల్లో ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, పోక్సో, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఆత్మహత్యలు, డ్రగ్స్, బాల్యవివాహాలు, వరకట్నం చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారని అన్నారు. నూతన మహిళా చట్టాలు, డయల్ 100, టీ సేఫ్‌యాప్, మహిళ భద్రత, రక్షణ చర్యలు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. షీటీం సభ్యులు ప్రత్యక్షంగా ఫిర్యాదులు తీసుకుంటారని, ఆన్‌లైన్, క్యూఆర్‌కోడ్, వాట్సప్, ద్వారా కూడా స్వీకరిస్తారని తెలిపారు. అసభ్యకర పోస్టులు పెట్టే వ్యక్తులు, సైబర్ నేరగాళ్లపై కూడా సైబర్, షీటీం సమన్వయంతో ప్రత్యేక నిఘా ఏర్పా టు చేశామన్నారు. మహిళలు, బాలికలు, విద్యార్థినులు షీటీం సేవలు ఉపయోగించుకోవాలన్నా రు. రామగుండం పోలీస్ కమిషనరేట్ షీటీం నం. 6303923700, పెద్దపల్లి జోన్ షీటీం నం. 8712659386 మంచిర్యాల జోన్ షీటీం నం. 8712659386కు కాల్ చేసినా, వాట్సాప్ ద్వారా సందేశం పంపించినా, డయల్ 100కు కాల్ చేసినా స్పందిస్తారని పేర్కొన్నారు.