
ఎన్టీపీసీలో రాష్ట్రీయ కర్మయోగి జన సేవా శిక్షణ
జ్యోతినగర్: ఎన్టీపీసీ రామగుండం ఎగ్జిక్యూటివ్ ట్రైనీ 2024 బ్యాచ్ సభ్యులకు గురువారం రాష్ట్రీయ కర్మయోగి జన్ సేవా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. టెంపరరీ టౌన్‌షిప్ ఉద్యోగ కేంద్రం మిలినీయం హాల్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్‌కుమార్ సామంత, ఏజీఎం బిజయ్‌కుమార్ సిగ్దర్ మార్గదర్శకత్వంలో కొనసాగిన శిక్షణలో మాస్టర్ ట్రైనర్లుగా విక్రాంత్ సింగ్, సోని, విశ్వనాథ్, గాయత్రి, వెంకటేశ్వరరావు, పంకజ్ వశిష్ఠ, ఆదిత్య ప్రకాశ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పలు అంశాలను వివరించారు.