న్యూస్‌రీల్
పొద్దున నామినేషన్ల సందడి
సాయంత్రం కోర్టు స్టేతో నిరాశ
స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్
గ్రామాల్లో నిశ్శబ్ద వాతావరణం
ఆరు వారాల తరువాతే ఎలక్షన్లపై స్పష్టత
శుక్రవారం శ్రీ 10 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
ఉత్సాహం..
స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసిన నేపథ్యంలో ప్రధాన పార్టీల కేడర్, ఆశావహుల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంది. పంచాయతీ పాలకవర్గాలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీ కాలం పూర్తయ్యి ఏడాదిన్నర కాలం గడిచింది. సుదీర్ఘ కాలంగా ఎన్నికలకు కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తూ జీవో విడుదల చేయడంతో బీసీవర్గాలకు దక్కే స్థానాల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ సైతం విడుదల కావడంతో పెద్ద సంఖ్యలో ఆశావహులు ఎన్నికలకు సిద్ధమయ్యారు. తాజాగా ఎన్నికల నిర్వహణ నిలిచిపోనుండటం ఆశావహులు, ప్రధాన పార్టీల కేడర్‌లో నైరాశ్యాన్ని నింపింది. కోర్టు తీర్పు ప్రకారం కనీసం నెల రోజుల తర్వాతే ఎన్నికల నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా బీసీలకు రిజర్వేషన్లపై కోర్టులో తేలేవరకు వేచి చూస్తారా, లేక పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తారా? అన్న దానిపైనే ఆసక్తి నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న చర్చ గ్రామ్లాలో కొనసాగుతోంది.
సాక్షిప్రతినిధి, కరీంనగర్:
స్థానిక సంస్థల ఎన్నికలకు గురువారం ఉదయం నామినేషన్ల నోటిఫికేషన్‌ను ఎన్నికల కమిషన్ విడుదల చేయడంతో ఉమ్మడి జిల్లాలోని పలు పల్లెల్లో సందడి నెలకొంది. అక్కడక్కడ కొందరు ఆశావహులు మద్దతుదారులతో వెళ్లి నామినేషన్లు వేశారు. కాగా.. బీసీ రిజర్వేషన్ల జీవో, ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించడంతో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది. రెండేళ్లుగా స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలవాలనుకున్న వారి ఆశలపై సాయంత్రానికి నీళ్లు చల్లినట్లయ్యింది. కొద్దిరోజులుగా అధికార యంత్రాంగం ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, సిబ్బందికి శిక్షణ, రిజర్వేషన్ల ప్రకటన, ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదల చేయడం ద్వారా ఎన్నికలు ఉంటాయని భావించిన వారికి కోర్టు స్టేతో ఊరించి ఉసురుమనిపించిన ట్లయ్యింది. ఆరు వారాల తరువాత కోర్టు విచారణ చేపట్టనుండటంతో, అప్పుడే ఎన్నికలు జరిగే అవకాశముంది. దీంతో గ్రామాల్లో నిన్నటి వరకు సందడి నెలకొనగా.. ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 6ఎంపీటీసీ, మూడు జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 311 ఎంపీటీసీలు, 30 జెడ్పీటీసీ స్థానాలకు తొలివిడత ఎన్నికల నోటిఫికేషన్‌ను ఆయా జిల్లాల కలెక్టర్లు విడుదల చేశారు. రిజర్వేషన్ల కేసు కోర్టులో ఉన్న నేపథ్యంలో నామినేషన్ దాఖలు చేసేందుకు ఆశావహులు ఆసక్తి చూపలేదు. ఈక్రమంలో జగిత్యాల జిల్లా కథలాపూర్ ఎంపీటీసీ స్థానానికి కారపు గంగాధర్, ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి ఎంపీటీసీకి నాంపెల్లి వెంకటాద్రి నామినేషన్ వేశారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం జల్లారం ఎంపీటీసీకి ఓదెలు, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్, బోయినపల్లి మండలాల జెడ్పీటీసీలకు ఎడపల్లి అనిల్, గురజా ల శ్రీధర్ నామినేషన్ వేశారు. వేములవాడ రూరల్ మండలం హన్మాజిపేట ఎంపీటీసీ స్థానానికి చిలుక ప్రభాకర్ నామినేషన్ వేశారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కన్నాపూర్, మెట్‌పల్లి ఎంపీటీసీలకు రెడ్డి కుమార్, గొట్టె మధు, వి.సైదాపూర్ జెడ్పీటీసీ స్థానాలకు అరుణ లంకదాసరి కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్లు వేశారు. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎంపీటీసీలకు 6, జెడ్పీటీసీలకు 3 నామినేషన్లు దాఖలయ్యాయి.
రిజర్వేషన్లు మారేనా?
ప్రస్తుతం ప్రభుత్వం బీసీలకు 23శాతం ఉన్న రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ జీవో జారీచేసి, దాని అనుగుణంగా సీట్లు ప్రకటించింది. తాజాగా కోర్టు తీర్పు నేపథ్యంలో గతంలో బీసీలకు ఉన్న 23శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహిస్తే, 19శాతం మేర బీసీలకు సీట్లు తగ్గనున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 60 జెడ్పీటీలు ఉండగా, 26బీసీలకు కేటాయించగా, 19 జనరల్‌కు కేటాయించారు. 556 ఎంపీటీసీలకు 240బీసీలకు, 184 జనరల్‌కు కేటాయించగా, పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తే బీసీలల్లో 19శాతం సీట్లు తగ్గి, అంతే మొత్తంలో జనరల్ సీట్ల సంఖ్య పెరగనుంది. మొత్తంగా స్థానిక ఎన్నికలపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
నైరాశ్యం
నైరాశ్యం
నైరాశ్యం