
తొలివిడత ఎన్నికలకు ఏర్పాట్లు
● మొదటిదశలో 7 జెడ్పీటీసీ, 68 ఎంపీటీసీ స్థానాలు ● కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి
పెద్దపల్లిరూరల్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తిచేశామని కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడించారు. స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు పటిష్ట కార్యాచరణ చేపట్టామని ఆయన అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణికుముదిని రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్పరెన్స్ ద్వారా మాట్లాడారు. మనజిల్లా నుంచి కలెక్టర్ కోయ శ్రీహర్ష, అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ, డీసీపీ కరుణాకర్ హాజరయ్యారు.
తొలివిడతలో 68 ఎంపీటీసీ, 7 జెడ్పీటీసీలు..
జిల్లాలో తొలివిడత నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల్లో 7 జెడ్పీటీసీ, 68 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేశామని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. రిటర్నింగ్ అధికారులకు, ఇతర సిబ్బందికి శిక్షణ ఇచ్చామని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ సామగ్రిని ఆయా మండలాలకు చేరవేసినట్టు కలెక్టర్ వివరించారు. నామినేషన్ కేంద్రాల వద్ద భద్రత కల్పించామని అన్నారు. జెడ్పీ సీఈవో నరేందర్, డీపీవో వీరబుచ్చయ్య, ఆర్డీవోలు గంగయ్య, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.