
రియల్టర్ల చూపు.. లిక్కర్ వైపు
● దరఖాస్తుల దాఖలుకు సన్నద్ధం ● అధిక లాభాల సాధనే లక్ష్యం
సుల్తానాబాద్(పెద్దపల్లి): రియల్ ఎస్టేట్, ఇటుకబట్టీ వ్యాపారులతోపాటు రైస్‌మిల్లర్లు వైన్స్‌షాపులు దక్కించుకునేందుకు టెండర్ల వేసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో ఇప్పటికే కొందరు దరఖాస్తు చేసినట్లు తెలిసింది. లిక్కర్ వ్యాపారంలో అధిక ఆదాయం సాధించొచ్చనే ఆలోచనతో డ్రాలో తమ అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.
18 వరకు దరఖాస్తుల స్వీకరణ
2025– 27 సంవత్సరాలకు సంబంధించి వైన్స్‌షాప్‌ల కోసం టెండర్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈనె ల 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. గౌడ, ఎస్సీ సామాజిక వర్గంలోని కొందరిని, వైన్స్ షాపు ల్లో పనిచేస్తున్న మరికొందరిని మచ్చిక చేసుకుని వారిపేరిట టెండర్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఇప్పటికే లిక్కర్ వ్యాపారంలో ఉన్నవారు సిండికేట్‌గా మారి భారీమొత్తంలో ద రఖాస్తులు చేసేందుకు పావులు కదుపుతున్నారు. వ్యాపారులతోపాటు రాజకీయ నాయకులు కూడా టెండర్ వేసేపనిలో నిమగ్నమయ్యారు.
జిల్లాలో 74 మద్యం షాపులు
జిల్లాలో 74 వైన్స్‌షాపులు ఉన్నాయి. ఇందులో గౌడలకు 13, ఎస్సీలకు 8 షాపులు కేటాయించగా.. మిగతావి జనరల్‌కు రిజర్వు చేశారని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మహిపాల్‌రెడ్డి తెలిపారు. ఒక్కొక్కరు ఎన్ని దరఖాస్తులైనా సమర్పించే అవకాశం ఉంది.
భూపతిపూర్‌పై అందరి దృష్టి..
జిల్లాలో అత్యధికంగా మద్యం విక్రయాలు సాగేది సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ వైన్స్‌లోనే అని గత గణాంకాలు చెబుతున్నాయి. దీంతో జిల్లా నలుమూలల నుంచి వ్యాపారులు భూపతిపూర్ వైన్స్‌షాప్‌ను దక్కించుకునేందుకు పోటీపడుతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది.
మద్యం దుకాణాలకు 4 దరఖాస్తులు
పెద్దపల్లిరూరల్: మద్యం దుకాణాల కోసం బు ధవారం 4 టెండర్లను దాఖలు చేశార ని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మహిపాల్‌రెడ్డి తెలిపారు. జిల్లాలో 74 మద్యం దుకాణాల కోసం టెండ ర్లు స్వీకరిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 21 దరఖాస్తులు దాఖలయ్యాయన్నారు. పెద్దపల్లి ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో 20 దుకాణాల కోసం ఇప్పటివరకు 6 టెండర్లు వచ్చాయన్నారు. సు ల్తానాబాద్ పరిధిలోని 15 దుకాణాల కోసం 4, రామగుండంలోని 24 దుకాణాల కోసం 3, మంథనిలోని 15 దుకాణాల కోసం 8 దరఖా స్తులు అందాయని ఆయన వివరించారు.
డ్రా పద్ధతిన కేటాయిస్తాం
ఈనెల 18వ తేదీ వరకు ఎకై ్సజ్ కార్యాలయంలో వైన్స్‌షాప్‌ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తాం. ఆరోజు సాయంత్రం ఐదు గంటల వరకు టెండర్లు స్వీకరిస్తాం. ఆ తర్వాత పెద్దపల్లి సమీపంలోని బందంపల్లి స్వరూప గార్డెన్స్‌లో డ్రా తీసి విజేతలకు దుకాణాలు కేటాయిస్తాం.
– మహిపాల్‌రెడ్డి, సూపరింటెండెంట్, ఎకై ్సజ్