‘ఎల్లంపల్లి’కి ఇన్‌ఫ్లో | - | Sakshi
Sakshi News home page

‘ఎల్లంపల్లి’కి ఇన్‌ఫ్లో

Oct 9 2025 3:15 AM | Updated on Oct 9 2025 3:15 AM

‘ఎల్ల

‘ఎల్లంపల్లి’కి ఇన్‌ఫ్లో

ఎన్టీపీసీలో సీఐఎస్‌ఎఫ్‌ డీఐజీ జ్యోతినగర్‌(రామగుండం): స్థానిక ఎన్టీపీసీ ప్రాజెక్టులో సీ ఐఎస్‌ఎఫ్‌ సౌత్‌ జోన్‌–2 డీఐజీ రాఘవేంద్రకుమార్‌ ఎం. బు ధవారం పర్యటించారు. హై దరాబాద్‌ నుంచి పీటీఎస్‌లో ని గెస్ట్‌హౌస్‌కు చేరుకున్న డీఐజీకి స్థానిక సీఐఎస్‌ఎఫ్‌ యూనిట్‌ సీనియర్‌ కమాండెంట్‌ అరవింద్‌కుమార్‌ పుష్పగుచ్ఛం అందించి స్వాగ తం పలికారు. అనంతరం మల్కాపూర్‌ రోడ్డు లోని బ్యారక్స్‌ను డీఐజీ సందర్శించి సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆ త ర్వాత మొక్కలు నాటారు. ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. భద్రతపై సమీక్షించారు.

రామగుండం: ఎల్లంపల్లి ప్రాజెక్టుకు గతంలో ఎ న్నడూలేనంత వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో గేట్లు ఎత్తి లక్షలాది క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. బుధవారం కూడా భా రీఇన్‌ఫ్లో కొనసాగినట్లు నీటిపారుదల శాఖ అ ధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వసామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా.. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 2.24 లక్షల క్యూసెక్కు ల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో 23 గేట్లు ఎత్తి 2.40 లక్షల క్యూసెక్కులను దిగువన ఉన్న గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు.

క్రీడల్లోనూ రాణించాలి

పెద్దపల్లిరూరల్‌: విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లోనూ రాణించాలని జిల్లా విద్యాధికారి మాధవి సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్ర భుత్వ జూనియర్‌ కాలేజీ మైదానంలో బుధవా రం 69వ జిల్లాస్థాయి ఎస్‌జీఎఫ్‌ అథ్లెటిక్స్‌ పో టీలు చేపట్టారు. డీఈవో జెండా ఊపి పోటీలు ప్రారంభించారు. మాధవి మాట్లాడుతూ, క్రీడలతో విద్యార్థుల మధ్య స్నేహసంబంధాలు పెంపొందుతాయన్నారు. క్రీడాపోటీల్లో గెలు పోటములు సహజమన్నారు. ఓటమి గెలుపునకు నాందిగా భావించి ముందుకు సాగాలని సూచించారు. డీవైఎస్‌వో సురేశ్‌, జిల్లా కార్యదర్శి లక్ష్మణ్‌, పీఈటీల సంఘం అధ్యక్ష, ప్రధా న కార్యదర్శులు సురేందర్‌, రమేశ్‌, శ్రీనివాస్‌, ప్రిన్సిపాల్‌ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఎమ్మార్పీఎస్‌ నేతల నిరసన

పెద్దపల్లిరూరల్‌: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌పై మరోమంత్రి పొన్నం ప్రభాకర్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ ఎమ్మార్పీఎ స్‌ నాయకులు బుధవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ రహదారిపై నిరసన తెలిపారు. దళిత మంత్రిని దూషించిన పొన్నం ప్రభాకర్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలని నాయకులు అంబా ల రాజేందర్‌, చందు, పల్లె సదానందం, నరేశ్‌, వంశీ, రఘునందన్‌, బొంకూరి నరేందర్‌ డి మాండ్‌ చేశారు. పొన్నం దిష్టిబొమ్మ తగులబె ట్టేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నా రు. రాజీవ్‌ రహదారిపై బైఠాయించడంతో వా హనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పోలీసులు రాకపోకలను పునరుద్ధరించారు.

పొగాకు నియంత్రణపై ర్యాలీ

పెద్దపల్లిరూరల్‌: ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల ప రిధిలో గురువారం (ఈనెల 9న) జాతీయ పొ గాకు నియంత్రణ, జాతీయ అంధత్వ, దృష్టిలో ప నియంత్రణపై అవగాహన ర్యాలీలు నిర్వహించాలని డీఎంహెచ్‌వో వాణిశ్రీ సూచించా రు. బుధవారం పీహెచ్‌సీ వైద్యులతో ఆమె మా ట్లాడారు. వారికి పలు సూచనలిచ్చారు. పొగాకుతో కలిగే హానిపై ప్రజల్లో 60 రోజులపాటు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపట్టా లని సూచించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అ ధికారులు రాజమౌళి, శ్రీరాములు, సుధాకర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌, రాజేశం పాల్గొన్నారు.

‘ఎల్లంపల్లి’కి ఇన్‌ఫ్లో 1
1/3

‘ఎల్లంపల్లి’కి ఇన్‌ఫ్లో

‘ఎల్లంపల్లి’కి ఇన్‌ఫ్లో 2
2/3

‘ఎల్లంపల్లి’కి ఇన్‌ఫ్లో

‘ఎల్లంపల్లి’కి ఇన్‌ఫ్లో 3
3/3

‘ఎల్లంపల్లి’కి ఇన్‌ఫ్లో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement