
ఎన్టీపీసీలో రికార్డుస్థాయి విద్యుత్ ఉత్పత్తి
జ్యోతినగర్(రామగుండం): రామగుండంలోని ఎన్టీపీసీ ప్రాజెక్టు 2025–26 ఆర్థిక సంవత్సరంలోని సెప్టెంబర్ వరకు 6,969.74 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసిందని అధికారులు తెలిపారు. ఈమేరకు 87.57 శాతం పీఎల్‌ఎఫ్ నమోదు అ య్యిందని వివరించారు. సెప్టెంబర్‌లో 841.91 మి లియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని 71.19 శాతం పీఎల్‌ఎఫ్ సామర్థ్యంతో పూర్తి చేసినట్లు వెల్లడించారు. 74 శాతం పీఎల్‌ఎఫ్‌తో ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నట్లు సమాచారం.
మొదటి యూనిట్‌లో రికార్డుస్థాయి ఉత్పత్తి
ఎన్టీపీసీ మొదటి యూనిట్ విద్యుత్ ఉత్పత్తిలో ఆల్ టైం రికార్డు సృష్టించింది. 200 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల మొదటి యూనిట్.. బుధవారం వ రకు నిరంతరాయంగా 217 రోజులపాటు విద్యుత్ ఉత్పత్తి చేసి రికార్డు నమోదు చేసింది. దీంతో అధికారులు, ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
11న చదరంగం పోటీలు
ఎలిగేడు(పెద్దపల్లి): స్థానిక జెడ్పీ హైస్కూల్ ఆవరణలో ఈనెల 11న జిల్లాస్థాయి చదరంగం ఎంపిక పోటీలు నిర్వహిస్తామని అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కనుకుంట్ల లక్ష్మణ్ తెలిపారు. 69వ ఎస్‌జీఎఫ్ జల్లాస్థాయి అండర్–14, 17 బాల, బాలికల విభాగంలో పోటీలు ఉంటాయని, ఆసక్తి గలవారు అర్హత ఫారామ్‌తోపాటు హాజరు కావాలన్నారు.