
‘బెస్ట్ అవైలబుల్’ ఫీజు చెల్లించాలి
● విద్యార్థులు, తల్లిదండ్రుల డిమాండ్ ● కలెక్టరేట్ ఎదుట రాజీవ్ రహదారిపై బైఠాయించి నిరసన
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని బెస్ట్‌అవైలబుల్ స్కూల్‌లో చదివే విద్యార్థుల ఫీజు మూడేళ్లుగా చెల్లించడం లేదని, బకాయిలు వెంటనే చెల్లించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈమేరకు కలెక్టరేట్ ఎదుట రాజీవ్‌రోడ్డుపై బుధవారం బైఠాయించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై నిరసన తెలిపారు. వామపక్ష పార్టీ, అనుబంధ సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. పాలకులు మూడేళ్లుగా ఫీజు చెల్లించడంలేదని, దీంతో పాఠశాల యజమాన్యాలతో విద్యార్థులు మానసిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులను పాఠశాలకు రానివ్వకపోవ డంతో భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని పే ర్కొన్నారు. వీలైనంత త్వరగా బకాయిలు చెల్లించా లని వారు డిమాండ్ చేశారు. రాజీవ్‌రోడ్డుపై బైఠాయించడంతో వాహనాలు బారులుదీరాయి. పోలీసులు సముదాయించి ఆందోళన విరమింపజేశారు. వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.