
ఆరోగ్యశ్రీ నిలిపివేయడం బాధాకరం
నిరుపేదలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకం నిలిపివేయడం బాధాకరం. డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకోలేని నిరుపేదలు చాలా ఇబ్బంది పడతారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. బకాయిలను కూడా విడుదల చేసి ఆస్పత్రులకు చేయూత ఇవ్వాలి.
– బి.రాజాకిషన్‌గౌడ్, కరీంనగర్
బకాయిల భారం పెరగడంతోనే..
ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తు న్న ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బ కాయిలు పెరిగిపోయాయి. నిర్వహణ భారంగా మారింది. వేతనాలు, మెయింటెనెన్స్ కష్టంగా మారడంతోనే ఉమ్మడి జిల్లా ఆసుపత్రుల యాజమాన్యాలు సమష్టిగా ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసే నిర్ణయం తీసుకున్నాం.
– విష్ణువర్ధన్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్
ఆసుపత్రుల అధ్యక్షుడు, ఉమ్మడి జిల్లా

ఆరోగ్యశ్రీ నిలిపివేయడం బాధాకరం