
కలెక్టరేట్‌లో విశ్వకర్మ జయంతి
పెద్దపల్లిరూరల్: విరాట్ విశ్వకర్మ యజ్ఙమహోత్సవ్‌ను కలెక్టరేట్‌లో బుధవారం ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ చిత్రపటం వద్ద మైనారిటీస్ ఫైనా న్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబెదుల్లా కొత్వాల్ సాహె బ్, కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యే విజయరమణారావు.. అడిషనల్ కలెక్టర్లు అరుణశ్రీ, వేణుతో కలిసి ప్రత్యేకపూజలు చేశారు. ప్రభుత్వాదేశాలతో విశ్వకర్మ ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నామ ని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా సెలవు ప్రకటించాలని సంఘం జిల్లా అ ధ్యక్షుడు కట్ట రాజానందం, నాయకులు కోరారు. బీసీ సంక్షేమశాఖ అధికారి రంగారెడ్డి పాల్గొన్నారు.