
మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
పెద్దపల్లిరూరల్: మహిళలకు మెరుగైన ఆరోగ్యసేవ లు అందించేందుకు స్వస్థ్‌నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ అమలు చేస్తున్నామని కలెక్టర్ శ్రీహర్ష, ఎంపీ వంశీకృష్ణ అన్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం పథకం ప్రారంభించి మాట్లాడారు. మహిళ లు ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుందన్నారు. డీఎంహెచ్‌వో వాణిశ్రీ, సూపరింటెండెంట్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
గోపాలమిత్రలకు సన్మానం
గోపాలమిత్రల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడిగా వునుకొండ శ్రీధర్, అధ్యక్షుడిగా కల్వల శ్రీనివాస్‌ను నియమించగా.. వారిని ఎంపీ సన్మానించారు. పాడిరైతులకు అండగా ఉండాలని సూచించారు.