
ఎన్టీపీసీలో విశ్వకర్మ జయంతి
జ్యోతినగర్(రామగుండం): రామగుండం ఎన్టీపీసీ – తెలంగాణ ప్రాజెక్టులో బుధవారం శ్రీవిశ్వకర్మ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) చందన్‌కుమార్ సామంత ప్రత్యేక పూ జలు చేశారు. అనంతరం సుమారు 2వేల మంది కార్మికులకు ప్రసాదం పంపిణీ చేశారు. కా ర్యక్రమంలో జనరల్ మేనేజర్లు ముకుల్ రా య్, మనీశ్‌అగర్వాల్, అవిజిత్ దత్తా, బినోయ్‌జోస్, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
సైబర్ నేరాలపై అవగాహన అవసరం
జ్యోతినగర్(రామగుండం): సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు అంగన్‌వాడీ టీచర్లు బాధ్యతగా వ్యవహరించాలని సైబర్ క్రై మ్ ఎస్సై కృష్ణమూర్తి సూచించారు. ఎన్టీపీసీ మిలీనియం హాల్‌లో బుధవారం ఏర్పాటు చే సిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడా రు. అనుమాతులు ఫోన్‌కాల్ చేస్తే బ్యాంక్, ఆ ధార్ తదితర వివరాలు తెలియజేయవద్దన్నా రు. ఓటీపీ, ఓఎల్‌ఎక్స్, పేటీఎం, ఫోన్ పే, గూ గుల్ పే, ఈ కేవైసీ అప్‌డేట్ తదితర సమాచా రం అడిగినా సమాధానం ఇవ్వొద్దని ఆయన సూచించారు. సైబర్ నేరాల బారినపడితే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌చేసి ఫిర్యా దు అందించాలని ఆయన కోరారు. అంగన్‌వాడీ టీచర్ల అసోసియేషన్ జిల్లా కో ఆర్డినేటర్ అనిల్, రామగుండం ప్రాజెక్ట్ సీడీపీవో అలేఖ్య పటేల్ తదితరులు పాల్గొన్నారు.
వైద్య సిబ్బందికి టీకాలు
పెద్దపల్లిరూరల్: జిల్లా ప్రధాన ఆస్పత్రిలో బుధవారం వైద్యసిబ్బందికి హైపటైటిస్– బీవ్యాధి నిరోధక టీకాలు వేశారు. ఈవ్యాధితో రక్తం, శరీరద్రవ్యాలు వ్యాప్తి చెందుతాయని డీఎంహెచ్‌వో వాణిశ్రీ, సూపరింటెండెంట్ శ్రీధర్ అన్నా రు. జీరో డోస్ తీసుకున్నాక నెలకు ఒక డోస్, ఆరునెలల తర్వాత రెండోడోస్ తీసుకోవాలని వారు సూచించారు. ప్రోగ్రాం అధికారి కిరణ్, ఆర్‌ఎంవో విజయ్, నర్సింగ్ సూపరింటెండెంట్ జమున తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా కార్యవర్గంలో పలువురికి చోటు
సుల్తానాబాద్(పెద్దపల్లి): బీజేపీ జిల్లా కార్యవర్గంలో పలువురికి చోటు కల్పించినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి బుధవారం తెలిపారు. ఉపాధ్యక్షులుగా అమరగాని ప్రదీప్ కుమార్, ముస్కూల భాస్కర్‌రెడ్డి, శనిగరపు రమేశ్, సౌదరి మహేందర్, మచ్చగిరి రాము, కాసాగోని నిర్మలగౌడ్, ప్రధాన కార్యదర్శులు గా కోమల మహేశ్ కుమార్, పల్లె సదానందం, కడారి అశోక్‌రావు, కార్యదర్శులుగా సో మా రపు లావణ్య, బిరుదు గట్టయ్య, మోటం న ర్సింగం, గర్రెపల్లి నారాయణస్వామి, దాడి సంతోష్, శివంగారి సతీశ్, కోశాధికారిగా కామని రాజేంద్రప్రసాద్‌ను నియమించామన్నారు. ఆ ఫీస్ కార్యదర్శిగా ఎస్‌ఎంసీ వనజ, సోషల్ మీ డియా ఇన్‌చార్జిగా కుమ్మ వెంకటకృషష్ణ, మీ డియా కన్వీనర్‌గా వెన్నంపల్లి శ్రీనివాస్‌రావు, ఐటీ ఇన్‌చార్జిగా అక్కపల్లి క్రాంతిని నియమించామన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో సంజీవరెడ్డి మాట్లాడుతూ, బీజేపీని మరింత బలోపేం చేసి వచ్చే అసంబ్లీ ఎన్నికల్లో విజ యమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.
కబడ్డీపోటీలకు ఎంపిక
ఎలిగేడు(పెద్దపల్లి): స్థానిక జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని మీనుగు భూలక్ష్మి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం దేవేందర్‌రావు బుధవారం తెలిపారు. జిల్లా కేంద్రంలో ఇటీవల జరిగిన సబ్ జూనియర్ కబడ్డీ ఎంపిక పో టీల్లో భూలక్ష్మి ప్రతిభ చూపిందన్నారు. ఈనెల 25న నిజామాబాద్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీల్లో ఆమె పాల్గొంటుందని పేర్కొన్నారు. బాలికను హెచ్‌ఎం, ఉపాధ్యాయులతోపాటు ఫిజికల్ డైరెక్టర్ ప్రణయ్‌కుమార్, గ్రామస్తులు అభినందించారు.

ఎన్టీపీసీలో విశ్వకర్మ జయంతి

ఎన్టీపీసీలో విశ్వకర్మ జయంతి

ఎన్టీపీసీలో విశ్వకర్మ జయంతి