
రక్తదానంతో మరొకరికి ప్రాణదానం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి
సుల్తానాబాద్(పెద్దపల్లి): రక్తదానం ద్వారా మరొక రికి ప్రాణదానం చేసిన వారవుతారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, సేవా పక్వాడ జిల్లా క న్వీనర్ నల్ల మనోహర్‌రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి మోదీ జన్మదినం సందర్భంగా రెడ్‌క్రాస్ సొసైటీ ఆ ధ్వర్యంలో స్థానిక ఆర్యవైశ్య భవనంలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. సంజీవరెడ్డి, మనోహర్‌రెడ్డి శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. దేశా న్ని అన్నిరంగాల్లో తీర్చిదిద్దిన ఘనత ప్రధాని మో దీకే దక్కుతుందన్నారు. అంతకుముందు పట్టణంలోని పూసాల రోడ్డులో తెలంగాణ విమోచన దినోత్సవం జరిపారు. నాయకులు కందుల శ్రీనివాస్, మీస అర్జున్‌రావు, కడారి అశోక్‌రావు, సౌదరి మ హేందర్‌యాదవ్, కామని రాజేంద్రప్రసాద్, చింతల లింగారెడ్డి, రఘుపతిరావు, చాతరాజు రమేశ్, గుంటి కుమార్, కోట నాగేశ్వర్, ఎళ్లేంకి రాజు, కొల్లూరి సంతోష్ కుమార్, కందునూరి కుమార్, గుడ్ల వెంకటేశ్, సతీశ్, సమ్మిరెడ్డి పాల్గొన్నారు.
2 వరకు సేవా కార్యక్రమాలు
పెద్దపల్లిరూరల్: ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా అక్టోబర్ 2వ తేదీవరకు వివిధ సేవా కార్యక్రమాలు చేపడతామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, సేవా పక్వాడ కన్వీనర్ నల్ల మనోహర్‌రెడ్డి తెలిపారు. మోదీ జన్మదినం సందర్భంగా జిల్లా కేంద్రంలో కేక్‌కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశా రు. రెడ్‌క్రాస్ సొసైటీ రక్తదాన శిబిరం నిర్వహించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దేశాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకుపోతున్నారన్నారు. కార్యక్రమంలో నా యకులు రాకేశ్, పల్లె సదానందం, అశోక్‌రావు, ప్ర దీప్, నిర్మల, శివంగారి సతీశ్, నర్సింగం, నారాయణస్వామి, చిలారపు పర్వతాలు, క్రాంతి, సంపత్, దిలీప్, రాజగోపాల్, మహంతకృష్ణ, సురేందర్, ఉమేశ్, రాజవీరు, హరీశ్ తదితరులు పాల్గొన్నారు.