అభివృద్ధి..సంక్షేమమే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి..సంక్షేమమే ధ్యేయం

Sep 18 2025 7:57 AM | Updated on Sep 18 2025 7:57 AM

అభివృ

అభివృద్ధి..సంక్షేమమే ధ్యేయం

ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అన్నదాతల సంక్షేమానికి ప్రాధాన్యత సరిపడా సాగునీటి సరఫరాకు చర్యలు ప్రజారోగ్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రుల ఆధునికీకరణ పేదలందరికీ రేషన్‌కార్డులు, సన్నబియ్యం పంపిణీ మైనార్టీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మహ్మద్‌ ఒబెదులా కొత్వాల్‌ ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

పెద్దపల్లిరూరల్‌: అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం పాలన సాగిస్తోందని మైనారిటీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మహమ్మద్‌ ఒబెదుల్లా కొత్వాల్‌ సాహెబ్‌ అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, అడిషనల్‌ కలెక్టర్లు అరుణశ్రీ, వేణుతో కలిసి ఆయన పాల్గొన్నారు. డీసీ పీ కరుణాకర్‌ ఆధ్వర్యంలో పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు.

ఆరు గ్యారంటీల అమలు..

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే పదేళ్లపాటు పాలించిన తొలిపాలకుల తీరుతోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని కొత్వాల్‌ విమర్శించారు. అయినా ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్ర యాణం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రూ. 500కే సిలిండర్‌, గృహజ్యోతి ద్వారా ఉచిత విద్యుత్‌ తదితర పథకాలు అందిస్తున్నట్లు వివరించారు.

బీసీలకు 42శాతం రిజర్వేషన్లు

బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారని ఒబెదుల్లా కొత్వాల్‌ అన్నారు. ఇందుకోసం కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఢిల్లీలో నిరసన చేపట్టారని ఆయన గుర్తుచేశారు. ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుందన్నారు.

జిల్లాలో ఆయకట్టు స్థిరీకరణ

జిల్లా రైతులకు సాగునీటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మహ్మద్‌ ఒబెదుల్లా కొత్వాల్‌ అన్నారు. 2 లక్షల 30 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించి, 10వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరందించేలా శ్రీలక్ష్మీనర్సింహాస్వామి పత్తిపా క రిజర్వాయర్‌ను 3 టీఎంసీల నుంచి 5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నామని అన్నారు. రూ.కోటి 10 లక్షలను డీపీఆర్‌ తయారీకి మంజూరు చేసిన ట్లు ఆయన తెలిపారు. 13 వేల 396 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేసే రామగుండం ఎత్తిపోతల పెండింగ్‌ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు.

అర్హులందరికీ రేషన్‌కార్డులు, సన్నబియ్యం..

అర్హులైన పేదలు పదేళ్లుగా రేషన్‌కార్డుల కోసం ఎదురుచూసి విసిగిపోయారని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక జిల్లాలో 12,168మందికి రేషన్‌కార్డులు అందించామని ఒబెదుల్లా కొత్వాల్‌ తెలిపారు. ప్రభుత్వ ఖజానాపై భారం పడుతున్నా ఉగాది పండుగ నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల ఆధునికీకరణ

ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందు కు జిల్లా ప్రధాన ఆస్పత్రిని రూ.52కోట్లతో ఆధునికీకరిస్తున్నామని ఒబెదుల్లా తెలిపారు. గోదావరిఖని జనరల్‌ ఆస్పత్రిని రూ.160కోట్లతో నిర్మిస్తన్నామన్నారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ద్వారా అందించే సేవలను రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు ప్రభుత్వం పెంచిందని ఆయన తెలిపారు. పెద్దపల్లిలో 100 పడకలు, మంథనిలో 50 పడకలు ఆస్పత్రుల నిర్మాణం పురోగతిలో ఉందన్నారు.

రూ.173కోట్లతో అభివృద్ధి పనులు

జిల్లాలో రూ.173 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని కొత్వాల్‌ అన్నారు. ఇందులో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బీటీ రోడ్లు ఉన్నాయన్నారు. మత్స్యకారులు, మహిళా సంఘా లు ఆర్థికాభ్యున్నతి సాధించేలా రాయితీ రుణాలు అందిస్తున్నామని ఆయన వివరించారు. ఆర్డీవో గంగయ్య, కలెక్టరేట్‌ ఏవో శ్రీనివాస్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అన్నయ్యగౌడ్‌తోపాటు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

వేడుకలకు హాజరైన ప్రముఖులు

పోలీసుల గౌరవ వందనం

మాట్లాడుతున్న మహ్మద్‌ ఒబెదుల్లా కొత్వాల్‌

రామగుండం సీపీ కార్యాలయంలో..

అభివృద్ధి..సంక్షేమమే ధ్యేయం1
1/4

అభివృద్ధి..సంక్షేమమే ధ్యేయం

అభివృద్ధి..సంక్షేమమే ధ్యేయం2
2/4

అభివృద్ధి..సంక్షేమమే ధ్యేయం

అభివృద్ధి..సంక్షేమమే ధ్యేయం3
3/4

అభివృద్ధి..సంక్షేమమే ధ్యేయం

అభివృద్ధి..సంక్షేమమే ధ్యేయం4
4/4

అభివృద్ధి..సంక్షేమమే ధ్యేయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement