
● మంథని కేంద్రంగా రెండు కేసుల దర్యాప్తు ● ‘కాళేశ్వరం’ అ
● ఉమ్మడి జిల్లాలో కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ ఇదేం కొత్త కాదు. గత ప్రభుత్వ హయాంలోనూ పలుమార్లు ఉమ్మడి కరీంనగర్ కేంద్రంగా అనేక కేసుల్లో విచారణ చేపట్టాయి. కొన్ని దాడులతో సరిపెట్టగా.. మరికొన్నిట్లో నోటీసుల వరకు వెళ్లాయి. ఇంకొన్నిట్లో విచారణ నేటికీ సాగుతోంది.
● ఈ ఏడాది మార్చిలో మయన్మార్ కేంద్రంగా సైబర్ కేఫ్‌ల వద్ద బంధీలుగా మారిన భారతీయులను కేంద్రం విడిపించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులు, బాధితులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారు కావడం గమనార్హం. ఈ కేసుపై ఎన్‌ఐఏ, సీబీఐ, ఇమిగ్రేషన్ సంస్థలు సంయుక్తంగా విచారణ చేపడుతున్నాయి.
● 2022 సెప్టెంబరులో పీఎఫ్‌ఐ సానుభూతిపరులను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. దేశ్యాప్తంగా పీఎఫ్‌ఐ సానుభూతిపరులను ఏకకాలంలో బెంబేలెత్తించింది. కరీంనగర్‌లోనూ ఇద్దరిని ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుంది.
● సీబీఐ ఆఫీసర్ అంటూ ఓ వ్యక్తి పలువురు వీఐపీలను మోసం చేసిన కేసులో అతని గురించి సమాచారం ఇవ్వాలంటూ 2022 డిసెంబరులో అప్పటి మంత్రి గంగుల కమలాకర్‌కు సీబీఐ అధికారులు నోటీసులు జారీచేశారు. ఈ ఘటన తరువాత ఉమ్మడి జిల్లాలో సీబీఐ అడుగుపెట్టడం ఇదే తొలిసారి.
● లిక్కర్‌స్కాంలో విచారణలో భాగంగా కరీంనగర్ చెందిన అనేక మంది ప్రముఖుల ఇళ్లపై హైదరాబాద్‌లో 2022 సెప్టెంబరులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. వీరి స్వస్థలమైన కరీంనగర్ నుంచి కూడా రహస్యంగా పలు ఫైళ్లు, ఇతర సమాచారం సేకరించింది.
● 2022 నవంబరులో గ్రానైట్ మైనింగ్‌లో అక్రమాలు జరిగాయని, ప్రభుత్వానికి భారీగా పన్ను ఎగవేశారని ఈడీ, ఇన్‌కం ట్యాక్స్ (ఐటీ) పలువురు వ్యాపారుల ఇళ్లలో సోదాలు నిర్వహించాయి.