నేడు జాబ్‌మేళా | - | Sakshi
Sakshi News home page

నేడు జాబ్‌మేళా

Sep 19 2025 3:10 AM | Updated on Sep 19 2025 3:10 AM

నేడు

నేడు జాబ్‌మేళా

పెద్దపల్లిరూరల్‌: నిరుద్యోగ యువతకు టెలిపెర్ఫార్మెన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు శుక్రవారం (ఈనెల 19న) జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. కస్టమర్‌ సర్వీస్‌ అసోసియేట్‌ కాంటెంట్‌ మోడల్‌ అనలిస్ట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. 2022 నుంచి 2025 వరకు డిగ్రీ, బీటెక్‌ ఉత్తీర్ణులైన వారు అర్హులని, ఆసక్తిగల సంబంధిత సర్టిఫికెట్ల జిరాక్సు ప్రతులతో జాబ్‌మేళాకు హాజరు కావాలన్నారు. పూర్తి వివరాలకు 90595 06807 నంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.

న్యాయవిజ్ఞానంపై అవగాహన ఉండాలి

పాలకుర్తి(రామగుండం): సమాజంలోని ప్రతిపౌరుడికి న్యాయవిజ్ఞానం, చట్టాలపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి స్వప్నరాణి అన్నారు. మండలంలోని కు క్కలగూడూరు జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. మ త్తు పదార్థాలతో కలిగే అనర్థాలపై వివరించా రు. పోక్సోయాక్టు కింద నమోదయ్యే కేసులపై అవగాహన కల్పించారు. ఎవరైనా న్యాయపరమైన సలహాలు కావాలనుకుంటే టోల్‌ఫ్రీ నంబరు 15100కు డయల్‌ చేసి పొందవచ్చని తెలి పారు. ఉచిత న్యాయసేవల కోసం జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా న్యాయసేవాధికార సంస్థను సంప్రదించాలన్నారు. పాఠశాల హెచ్‌ఎం తోపాటు గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అందరం హిందీ మాట్లాడుదాం

జ్యోతినగర్‌(రామగుండం): హిందీ మన దేశ భాష అని, అందరం మాట్లాకుందామని ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ చందన్‌కుమార్‌ సామంత అన్నారు. హిందీ పక్షోత్సవాల్లో భాగంగా గురువారం ప్రాజెక్టు ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సదస్సును ప్రారంభించి మాట్లాడారు. ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టులో హిందీ అమలులో విశిష్టమైన పనితీరు కనబర్చినందులకు గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన కార్యక్రమంలో అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ మేరకు అధికారులకు, ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. ఉద్యోగులు మాట్లాడడంతో పాటు హిందీలో గమనికలు రాయాలని కోరారు. జనరల్‌ మేనేజర్లు ముకుల్‌రాయ్‌, మనీశ్‌ అగ్రవాల్‌, ఏజీఎం(హెచ్‌ఆర్‌)బిజయ్‌కుమార్‌ సిగ్దర్‌, రాజభాషా విభాగం, విశాఖపట్నం సహాయ డైరెక్టర్‌ గౌసియా బేగం, సీనియర్‌ మేనేజర్‌ స్నేహలత తదితరులు పాల్గొన్నారు.

ఇండోర్‌ స్టేడియాన్ని సద్వినియోగం చేసుకోవాలి

రామగిరి(మంథని): మంథని జేఎన్టీయూ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇండోర్‌ స్టేడియాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బులుసు విష్ణువర్ధన్‌ అన్నారు. కళాశాలలో ఏర్పాటు చేసిన ఇండోర్‌ స్టేడియాన్ని గురువారం ప్రారంభించి మాట్లాడారు. వీసీ కిషన్‌కుమార్‌రెడ్డి మంథని జేఎన్టీయూ కళాశాలను సందర్శించినప్పుడు ఇండోర్‌ స్టేడియం ఏర్పాటు చేయాలని కోరగా నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. రూ.3 లక్షలతో సింథటిక్‌ రబ్బర్‌ మ్యాట్లతో మూడు షటిల్‌ బాడ్మింటన్‌ కోర్టులు, రూ.2 లక్షలతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రబ్బర్‌ కబడ్డీ మ్యాట్లు, టేబుల్‌ టెన్నీస్‌ మ్యాట్లు మంజూరు చేశారని, అలాగే 4 క్యారమ్‌ బోర్డులు, పది చెస్‌ బోర్డులతో కలిసి అన్ని ఒకే దగ్గర ఉండేలా ఇండోర్‌ స్టేడియం నిర్మించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ ఉదయ్‌కుమార్‌, పరిపాలనాధికారి సీహెచ్‌.సుమన్‌రెడ్డి, జూనియర్‌ అసిస్టెంట్‌ విజయ్‌పాల్‌, ఫిజికల్‌ డైరెక్టర్లు పింగిలి కృష్ణారెడ్డి, సునీల్‌కుమార్‌గౌడ్‌, ఏఈఈ ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు జాబ్‌మేళా1
1/2

నేడు జాబ్‌మేళా

నేడు జాబ్‌మేళా2
2/2

నేడు జాబ్‌మేళా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement