
మార్కెట్‌యార్డు ఆదాయం పెంపునకు చర్యలు
● ఎమ్మెల్యే విజయరమణారావు
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆదాయం పెంపునకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. గురువారం మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఈర్ల స్వరూప అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో మార్కెట్ షాపింగ్‌కాంప్లెక్సు గదులను అద్దెకు ఇవ్వడం కోసం ఓపెన్ యాక్షన్ నిర్వహించినా.. అద్దెకు తీసుకునేందుకు ముందుకు రావడం లేదని జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్‌రెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ అద్దె ప్రాతిపదికన ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని తీర్మానించారు. అలాగే మహిళా సంఘ సభ్యులు పెట్రోల్‌బంకు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా మార్కెట్‌యార్డు ఆవరణలో స్థలం కేటాయించాలని తీర్మానించారు. అలాగే మార్కెట్ యార్డులో వర్షానికి తడిసి పాడైన ధాన్యంతో నష్టపోయిన రైతులకు ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ సమకూర్చిన ప రిహారం చెక్కులను ఎమ్మెల్యే అందించారు. మార్కె ట్ యార్డులో వర్షానికి తడిసిన ధాన్యానికి పరి హారం అందించడం ఇదే తొలిసారి అని పేర్కొన్నా రు. వైస్ చైర్మన్ మల్లారెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.