
గోదావరి పుష్కరాలకు ప్రణాళిక సిద్ధం చేయండి
ధర్మపురి: రానున్న గోదావరి పుష్కరాలకు ప్రణాళిక సిద్ధం చేయాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. గోదావరిలోగల పుష్కరఘాట్లను బుధవారం దేవాదాయశాఖ కమిషనర్ శైలజారామయ్యర్‌తో కలిసి పరిశీలించారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు రానున్నందున సరిపడా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పుష్కరాల పనులపై ప్రణాళిక సిద్ధం చేసి త్వరగా పంపించాలని అన్నారు. గోదావరిలో గతంలో ఏర్పాటు చేసిన పుష్కరఘాట్లతో పాటు మరికొని ఘాట్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలో పరిశీలన చేసి ముందుకుసాగాలన్నారు. మంగళిగడ్డ, సంతోషిమాత, సోమవిహార్ పుష్కర్‌ఘాట్లతోపాటు గడ్డ హన్మాండ్ల ఆలయం వద్ద పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, ఆలయ ఈవో శ్రీనివాస్, ట్రస్ట్‌బోర్డు చైర్మన్ జక్కు రవీందర్, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావ్ తదితరులున్నారు.
కిడ్నాపర్ల అరెస్ట్
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లిలోని మైత్రీ హోటల్ సమీపంలో కిడ్నాపర్లను బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు కొత్తపల్లి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో బిల్ల కోటేశ్వర్ తెలిపారు. సీఐ వివరాల మేరకు.. నిష్ఠూరి యశ్వంత్(ఛత్తీస్‌గఢ్)కు రెండేళ్ల క్రితం నల్లపాటి నరేశ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో గ్రానైట్‌కు సంబంధించిన వ్యాపారం చేసేందుకు ఒరిస్సాకు చెందిన వ్యక్తిని యశ్వంత్ పరిచయం చేశాడు. దీంతో రూ.3లక్షలు ఒరిస్సాకు చెందిన వ్యక్తికి మధు ఇచ్చాడు. అతడు ఆ డబ్బులు ఎంతకు తిరిగి ఇవ్వకపోగా.. మధ్యవర్తిగా ఉన్న నువ్వే ఇవ్వాలని యశ్వంత్‌పై ఒత్తిడి తెచ్చాడు. కరీంనగర్‌కు వస్తున్నానని అక్కడ మాట్లాడుకుందామని చెప్పాడు. అనుకున్నట్లే ఈనెల 7న కరీంనగర్‌కు వచ్చిన యశ్వంత్‌ను భోజనం చేసుకుంటూ మాట్లాడుకుందాం రమ్మని కొత్తపల్లికి నరేశ్ పిలిచాడు. దీంతో యశ్వంత్, ముద్దుల మధు(భద్రాచలం) కొత్తపల్లికి రాగా.. వారిని నల్లపాటి నరేశ్‌తోపాటు మరో నలుగురు గుడిమల్ల సివిల్, తునికిపాటి శేఖర్, ఆలకుంట ఉపేందర్, ఆలకుంట అశోక్ కిడ్నాప్ చేసి హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి మధు, ఖమ్మం వెళ్లే క్రమంలో యశ్వంత్ తప్పించుకున్నారు. కిడ్నాప్‌తో భయపడ్డ యశ్వంత్, మధు కొంత డబ్బును చెల్లించారు. ఈ విషయాన్ని యశ్వంత్ అల్లుడు కొత్తపల్లి పోలీసులకు సమాచారమివ్వగా.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కిడ్నాప్‌కు పాల్పడ్డ నల్లపాటి నరేశ్, గుడిమల్ల సివిల్, తునికిపాటి శేఖర్, ఆలకుంట ఉపేందర్, ఆలకుంట అశోక్ అనే నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 2 కార్లు, 5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కిడ్నాప్ వ్యవహారంలో ఉన్న మరికొంతమందిని కూడా పట్టుకుంటామని సీఐ కోటేశ్వర్ పేర్కొన్నారు. 48 గంటల్లో కేసును ఛేదించి నేరస్తులను అదుపులోకి తీసుకున్న ఇన్‌స్పెక్టర్ కోటేశ్వర్, ఎస్సైలు సాంబమూర్తి, సంజీవ్‌ను ఉన్నతాధికారులు అభినందించారు.