
ఘనంగా ‘సర్వేపల్లి’ జయంతి
పెద్దపల్లిరూరల్: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని జిల్లా కేంద్రంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రాధాకృష్ణన్ విగ్రహానికి ఎ మ్మెల్యే విజయరమణారావు, రెసిడెన్షియల్ టీ చర్స్ అసోసియేషన్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యాశాఖ అధికారు లు హనుమంతు, సురేందర్‌కుమార్, రాంరెడ్డి, చాట్ల ఆగయ్య, సాదుల వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, ప్రవీణ్, మహేందర్‌రెడ్డి, రామస్వా మి, కిషన్‌రెడ్డి, సంపత్‌రెడ్డి, కనకయ్య ఉన్నారు.
అందరూ మొక్కలు నాటాలి
జ్యోతినగర్(రామగుండం): పర్యావరణ పరిరక్షణ కోసం కుటుంబ సభ్యుల పేరిట మొక్కలు నాటాలని రామగుండంలోని ఎన్టీపీసీ తెలంగా ణ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్‌కుమార్ సామంత సూచించారు. ఎన్టీపీసీ పీటీఎస్‌లో శుక్రవారం ఏక్ పేడ్ మా కే నామ్ ప్లాంటేషన్ డ్రైవ్ చేపట్టారు. ఈడీ మొక్కలు నాటి మాట్లాడారు. మొక్కల సంరక్షణతో పర్యావరణం మెరుగుపడుతుందని ఆయన తెలిపారు.
ఆర్జీ–3లో సీసీఎఫ్ పర్యటన
రామగిరి(మంథని): అటవీ శాఖ చీఫ్ కన్జర్వేట ర్(కాళేశ్వరం సర్కిల్) ప్రభాకర్ శుక్రవారం సింగరేణి ఆర్జీ–3 ఏరియాలో పర్యటించారు. ఓసీ పీ ఓవర్ బర్డెన్ డంపుపై 65 హెక్టార్లను అటవీ శాఖకు అప్పగించడానికి చేపట్టిన ఏర్పాట్లు పరి శీలించారు. రామగిరి అతిథి గృహంలో సమీక్షించారు. జీఎం సుధాకర్‌రావు, డీఎఫ్‌వో శివ య్య, ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటరమణ, ఎస్టేట్స్ విభాగాధిపతి ఐలయ్య, సర్వే విభాగాధిపతి జ నార్దనరెడ్డి, ఎఫ్‌ఆర్వో రమేశ్, జూనియర్ ఫా రెస్ట్రీ అధికారి మేఘన పాల్గొన్నారు.
రేపు ఓదెల మల్లన్న ఆలయం మూసివేత
ఓదెల(పెద్దపల్లి): ఓదెల మల్లికార్జునస్వామి ఆ లయాన్ని ఆదివారం మూసివేస్తామని ఈవో స దయ్య తెలిపారు. చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 11.30 గంటలకు ఆలయాన్ని మూసివేస్తామని, ఆలయ సంప్రోక్షణ తర్వాత సోమవారం ఉదయం 9 గంటలకు భక్తులకు దర్శన అవకాశం కల్పిస్తాయని వివరించారు.
అప్రమత్తంగా ఉండాలి
సుల్తానాబాద్(పెద్దపల్లి): సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి వాణిశ్రీ సూచించారు. పట్టణంలోని ఊర చెరు వు వద్ద శుక్రవారం చేపట్టిన వైద్య శిబిరాన్ని ఆమె తనిఖీ చేశారు. జ్వరబాధితులు ప్రభుత్వ ఆస్పత్రులను ఆశ్రయించి ఉచితంగా వైద్యసేవలు పొందాలని సూచించారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో రాములు, సుధాకర్, కిరణ్‌కుమార్, ఉదయ్‌కుమార్, సిబ్బంది సౌందర్య, రోజా, ఎలిజిబెత్, దివ్య తదితరులు పాల్గొన్నారు.
కనీస వేతనం చెల్లించాలి
జ్యోతినగర్(రామగుండం): కాంట్రాక్ట్, అవు ట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేసి, కనీస వేతనం నెలకు రూ.26వేలు చెల్లించాలని కాంట్రాక్టు కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుక శంకర్ డిమాండ్ చేశారు. ఇందుకో సం కార్మికులు చేసే సమ్మె వారిజన్మహక్కు అ న్నారు. ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్‌షిప్‌లో శుక్రవారం జరిగిన సమావేశంలోమాట్లాడారు. కాంట్రాక్టు, 8గంటల పనివిధానం అమలు చేయా లని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఈనెల 7న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చేపట్టే ఐఎఫ్‌టీయూ రాష్ట్ర సదస్సుకు హాజరు కావాలని ఆయన కోరారు. అనంతరం పోస్టర్ ఆవిష్కరించారు. నాయకు లు పుట్ట స్వామి, గుండు రాజయ్య, దుర్గం ర వీందర్, సుధాకర్, నర్సయ్య, సత్యం, చిరంజీవి, రాయమల్లమ్మ, పద్మ, కవిత, ఓదెమ్మ, సంధ్య, శంకరమ్మ, భాగ్య, స్వరూప, సూరమ్మ, కనకమ్మలతో పాటు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ‘సర్వేపల్లి’ జయంతి

ఘనంగా ‘సర్వేపల్లి’ జయంతి