
ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
మంథని: రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న వారిని హైదరాబాద్‌లో శుక్రవారం పలువురు ప్రముఖులు ఘనంగా సన్మానించారు. రాష్ట్ర రాజధానిలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పురస్కారం అందుకున్నవారిలో జిల్లాకు చెందిన పలువురు ఉపాధ్యాయులు ఉన్నారు. మంథనిలోని బాలికల ఉన్నత పాఠశాల గణితం ఉపాధ్యాయుడు గీట్ల భరత్‌రెడ్డి విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. ఆయనను ఉపాధ్యాయులు, విద్యార్థులు, మంథనివాసులు అభినందనలు తెలిపారు.
ఓదెల లెక్చరర్‌కు
ఓదెల(పెద్దపల్లి): కొలనూర్ గ్రామానికి చెందిన ఉత్తమ లెక్చరర్ మద్దెల రామకృష్ణను కరీంనగర్‌లో హాస్యనటుడు సదానందం, లెక్చరర్లు, ఉపాధ్యాయులు సన్మానించారు.
అవార్డు అందుకున్న కోడూరి శ్రీనివాణి
ఎలిగేడు(పెద్దపల్లి): అర్ధశాస్త్రం ఉన్నత విద్యావిభాగంలో రాష్ట్రస్థాయిలో ఎంపికైన డాక్టర్ కోడూరి శ్రీవాణి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి తదితరుల నుంచి ఉత్తమ ఆచార్యులు అవార్డు అందుకున్నారు. ఆమెను పలువురు అభినందించారు.

ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం