
జ్యూట్ బ్యాగుల వినియోగాన్ని ప్రోత్సహించాలి
కోల్‌సిటీ(రామగుండం): పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించి, జ్యూట్ బ్యాగుల వాడకాన్ని ప్రోత్సహించాలని స దాశయ ఫౌండేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి సీహెచ్ లింగమూర్తి, జిల్లా గౌరవ అధ్యక్షుడు లగిశెట్టి చంద్రమౌళి, ప్రచార కార్యదర్శి కేఎస్ వాసు అన్నారు. గోదావరిఖని కల్యాణ్‌నగర్‌ని శ్రీనిధి ట వర్స్ అపార్మెంట్‌లో శుక్రవారం గణేశ్ నవరాత్రు ల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్య క్రమంలో ఫౌండేషన్ గౌరవ అధ్యక్షుడు సానా రా మకృష్ణారెడ్డి సహకారంతో స్థానికులకు జ్యూట్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నే త్ర, అవయవ, శరీర దానాలపై అవగాహన కల్పించారు. అపార్మెంట్ కమిటీ అధ్యక్షుడు లగిశెట్టి చంద్రమౌళి ఆధ్వర్యంలో ప్రతినిధులను సత్కరించారు. పిల్లలు, మహిళలు భక్తి శ్రద్ధలతో నిమజ్జనానికి నృత్యాలు చేస్తూ గణనాథుని శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో టవర్స్ గౌరవ అధ్యక్షుడు విశ్వనాథం, సలహాదారులు విజయ్ కుమార్‌గౌడ్, వెంకటేశ్వర్లు, కార్యదర్శి రామచంద్రం, కోశాధికారి నాగరాజు, వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు శ్రీనివాస్, బ్రహ్మచారి, సమ్మయ్య, స్వామి, సత్తయ్య, సురేందర్ తిరుపతిరెడ్డి, కోటేశ్వర్, దేవదర్శన్‌రెడ్డి, సత్తయ్య, రామ్మూర్తి, రంగజ్యోతి, స్వరూప, సునీత, సుమతి, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.