
రూ.33 కోట్లతో అభివృద్ధి పనులు
● పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ ● బీటీ రోడ్డు పనుల పరిశీలన
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలో చేపట్టిన రహదారులు, డ్రైనేజీల నిర్మాణాలకు రూ.33 కోట్లు వెచ్చిస్తున్నామని పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ అన్నారు. పట్టణంలోని మసీదు చౌరస్తా నుంచి అమర్‌నగర్ వరకు సాగుతున్న బీటీ రోడ్డు పనులను ఏఈ సతీశ్‌తో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. ప్రజాసౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని పనులను చేపట్టినట్లు పేర్కొన్నారు. పట్టణంలో అభివృద్ధి పనులు దాదాపు చివరిదశలో ఉన్నాయని ఆయన వివరించారు. వర్క్ ఇన్‌స్పెక్టర్లు అనిల్‌కుమార్, వాణి, రాముడు ఇతర సిబ్బంది ఉన్నారు.