
డిజిటల్ అరెస్ట్‌పై అవగాహన
గోదావరిఖనిటౌన్: సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి, సీఐ కృష్ణమూర్తి ఆదేశాల మేరకు స్థానిక అశోక్‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు డిజిటల్ అరెస్ట్‌పై బుధవారం అవగాహన కల్పించారు. కొందరు విద్యార్థులు సైబర్ క్రైమ్ పోలీసుల వేషధారణలో స్క్రిప్ట్ రూపొందించుకొని తోటి విద్యార్థులకు అర్థమయ్యేలా డిజిటల్ అరెస్ట్‌పై ప్రదర్శనలు ఇచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు అధికారుల పేరిట ఫోన్‌చేసి కేసులు ఉన్నాయని భయాందోళనకు గురిచేస్తారని తెలిపారు. ఆ వ్యక్తి అడిగినంత డబ్బులు ఇచ్చి ఆ తర్వాత మోసపోయానని గుర్తించడం తరచూ చోటుచేసుకుంటున్నాయని విద్యార్థులు తమ ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పించారు. స్క్రిప్ట్‌లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు వెంకటేశ్, శ్రీనివాస్, సంతోష్‌కుమార్, మౌనిక, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.