
విధులకు సకాలంలో హాజరు కావాలి
● ‘బయోమెట్రిక్’ను అందుబాటులోకి తేవాలి ● పేషెంట్లతో మర్యాదగా ప్రవర్తించాలి ● వైద్య సిబ్బందికి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు
పెద్దపల్లిరూరల్: అది జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి.. బుధవారం ఉదయం 9 గంటల సమయంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆస్పత్రికి చేరుకున్నారు.. ఆవరణ అంతా కలియతిరిగారు.. వైద్యులు, సిబ్బంది హాజరు రిజిష్టర్ తనిఖీ చేశారు. ఉదయం 9.30 గంటల తర్వాత ఆరుగురు వైద్యులు విధులకు రావడా న్ని గమనించారు.. ఇకముందు ఇలా ఆలస్యం కా కుండా సకాలంలో డ్యూటీకి వచ్చేందుకు వీలుగా బ యోమెట్రిక్ పద్ధతి పాటించేలా ఏర్పాట్లు చేయాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీధర్‌ను ఆదేశించారు. డ్యూటీ టైంలో ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తామంటే కుదరదని, ఇకనుంచి కచ్చితంగా సమయపాలన పాటించ ని వారిపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. కొత్త ఆస్పత్రి భవన నిర్మాణంలో వేగం పెంచాలని ఆదేశించారు. ఇన్‌పేషెంట్లతో కాసేపు మాట్లాడారు. వైద్యసిబ్బంది అందిస్తున్న సేవలు, ప్రవర్తిస్తున్న తీరుపై ఆరా తీశారు. పేషెంట్లతో మర్యాదగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. ఇదే ఆవరణలోని ఆయుష్ ఆస్పత్రిలోని వైద్యుడు మారుతితోనూ కలెక్టర్ మాట్లాడారు. వైద్యసేవలు, మందులపై ఆరా తీశారు. నెలరోజులకు సరిపడా మందులు కొనుగోలు చేసి పేషెంట్లకు అందుబాటులో ఉంచామని కలెక్టర్ తెలిపారు.
కలెక్టరేట్‌లో సమీక్ష..
జిల్లాలో టీబీ ముక్త్‌భారత్, సీజనల్ వ్యాధులు, ఈనెల 11న చేపట్టే నులిపురుగుల నివారణ తదితర అంశాలపై కలెక్టర్ శ్రీహర్ష కలెక్టరేట్‌లో సమీక్షించారు. హెల్త్ సబ్ సెంటర్ల వారీగా లక్ష్యం ఎంచుకు ని వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలని ఆదేశించా రు. జిల్లావ్యాప్తంగా ఫీవర్ సర్వే నిర్వహించాలని సూచించారు. గర్భిణులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ అన్నారు. ఆపరేషన్లు కాకుండా సాధారణ ప్రసవాలను పెంచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో అన్న ప్రసన్నకుమారి, ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.