
ప్రొఫె‘సార్’కు ఘననివాళి
పెద్దపల్లిరూరల్: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని కలెక్టరేట్‌లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి కలెక్టర్ కోయ శ్రీహర్ష పూలమాల వేసి ని వాళి అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సార్ పాత్ర మరువలేనిదని ఆయన అన్నారు. ఆయన ఆశయ సాధనకోసం అందరూ కృషి చేయాలని కలెక్టర్ కోరారు. పలువురు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జాతిపితగా గుర్తించాలి
మంథని: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్‌ను తెలంగాణ జాతిపితగా గుర్తించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మంథని విజయ్‌కుమార్ కోరారు. జయశంకర్ సార్ జయంతి సందర్భంగా పట్టణంలోని ఆయన విగ్రహానికి బుధవారం పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం విజయ్‌కుమార్ మాట్లాడుతూ, సార్ ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. నాయకులు గోగుల రాజిరెడ్డి, గుర్రం దేవేందర్‌గౌడ్, బెజ్జింకి డిగంబర్, జాడి జంపన్న తదితరులు పాల్గొన్నారు. అలాగే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు ఏగోళపు శంకర్‌గౌడ్, ఆరెపల్లి కుమార్, తగరం శంకర్‌లాల్, మాచిడి రాజుగౌడ్, ఆసిఫ్‌ఖాన్, పుప్పాల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
మహిళా సాధికారత లక్ష్యం
జ్యోతినగర్(రామగుండం): మహిళా సాధికార త లక్ష్యంగా అందరూ బాధ్యతతో పనిచేయా లని మహిళా సాధికారత జిల్లా కో ఆర్టినేటర్ దయా అరుణ కోరారు. ఎన్టీపీసీ కృష్ణానగర్‌లో బుధవారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మహిళల హక్కు లు, అంగన్‌వాడీ కార్యకర్తల సేవలు, పనిప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు, సఖి కేంద్రం సేవలు, టోల్ ఫ్రీ నంబర్లు, ఉన్నత విద్య, లింగ వివక్ష, బాలసదనం సేవలు తదితర అంశాలపై ఆమె అవగాహన కల్పించారు. విక్టరీ ఇన్‌స్టిట్యూట్ నిర్వాహకురాలు వరలక్ష్మీ, అధ్యాపకురాలు శ్రీజ, అనూష, శిక్షణ పొందుతున్న మహిళలు తదితరులు పాల్గొన్నారు.
తల్లిపాలు అమృతంతో సమానం
జ్యోతినగర్(రామగుండం): తల్లిపాలు శిశువుకు అమృతం లాంటివని రామగుండం ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీవో అలేఖ్య అన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఎన్టీపీసీ అన్న పూర్ణకాలనీ అంబేడ్కర్‌హాల్‌లో గర్భిణులకు బుధవారం సీమంతం జరిపించారు. అలేఖ్య మాట్లాడుతూ, ప్రస్తుత ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం తల్లిపాల కన్నా మెరుగైన ఆహా రం తయారు చేయలేకపోయిందని అన్నారు. అందుకే తల్లిపాల విష్ఠతను వివరిస్తూ ఏటా ఆగస్టు ఒకటినుంచి ఏడోతేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ లక్ష్మి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మామిడిపల్లి శ్రీధర్, కార్యదర్శి కొల్లూరు విజేందర్, ప్రతినిధులు కొలిపాక సతీశ్, కజాంపురం రాజేందర్, నార్ల ప్రసాద్, గుంత వినోద్, రంగారావు గోపాలరావు, రమణారావు తదితరులు పాల్గొన్నారు.

ప్రొఫె‘సార్’కు ఘననివాళి

ప్రొఫె‘సార్’కు ఘననివాళి

ప్రొఫె‘సార్’కు ఘననివాళి