
చిన్నారుల చదువుపై శ్రద్ధ చూపాలి
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లిలోని బాలసదనం కేంద్రాన్ని గురువారం కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా సందర్శించారు. చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. వారంతా బడికి వెళ్లేలా చూడాలని, చిన్నారుల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. చందపల్లిలోని బస్తీ దవాఖానాలో ఒపీ సేవలపై ఆరా తీశారు. సఖి కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ సమస్యలతో కేంద్రాన్ని ఆశ్రయించే వారికి సంపూర్ణ సహకారం అందించాలన్నారు.
‘టాస్క్’ శిక్షణకు ప్రచారం కల్పించాలి
జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘టాస్క్’ శిక్షణ కేంద్రంపై విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాబోయే 6నెలల్లో కనీసం వెయ్యిమందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు.
ఇతర పనులపై దృష్టిసారించాలి
వ్యవసాయం, సినిమాటోగ్రఫీ రంగాల్లో ఉపాధి పొందేందుకు వీలుగా శిక్షణ ఇచ్చేందుకుగల అవకా శాలను పరిశీలించాలని కలెక్టర్ సంబంధిత అధి కారులకు సూచించారు. పంటల సాగులో వచ్చిన ఆధునిక సాంకేతికతపై శిక్షణ ఇవ్వాలన్నారు.
అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు
జిల్లాలోని ఇసుక రీచ్‌ల నుంచి అక్రమంగా ఇసుక తరలించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కోయ శ్రీహర్ష హెచ్చరించారు. కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి శివారులో గురువారం అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను సీజ్ చేసినట్టు తెలిపారు.
15రోజుల్లోగా రికవరీ చేయాలి
జిల్లాలోని సీ్త్రనిధిలో దుర్వినియోగం చేసిన నిధులను సంబంధిత వీఓఏ, ఓబీల నుంచి 15రోజుల్లోగా రికవరీ చేయాలని, లేదంటే చట్ట ప్రకారం ఆస్తులను జప్తు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ప్రతి గ్రామంలో స్వశక్తి సంఘాల సభ్యుల లావాదేవీల రికార్డులు స్పష్టంగా ఉండాలన్నారు.
పీహెచ్‌సీ తనిఖీ
ఓదెల(పెద్దపల్లి): ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నా రు. గురువారం మండలంలోని కొలనూర్ పీహెచ్‌సీని తనిఖీ చేశారు. సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్, డాక్టర్ సంజనేశ్ పాల్గొన్నారు.
కలెక్టర్ కోయ శ్రీహర్ష