
దోమలతో నరకం
దోమలతో భరించలేకపోతున్నాం. సూదులతో పొడిచినట్లు కుడుతున్నాయి. పగలు, రాత్రి నిద్రలేకుండా చేస్తున్నాయి. అందరికీ జ్వరాలే వస్తున్నాయి. పాముల భయంతో రోడ్డుమీద అడుపెట్టలేకపోతున్నాం. చిత్తడిగా పెరిగిన పిచ్చిచెట్లను తొలగించాలి.
– కత్తరమల్ల శంకరమ్మ,
కేసీఆర్‌కాలనీ, గోదావరిఖని
స్పెషల్‌డ్రైవ్ చేపట్టాలి
కేసీఆర్‌కాలనీ, ప్రగతినగర్, సాయినగర్‌లో బల్దియా అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి. దోమలతో విషజ్వరాలు ప్రబలకముందే అప్రమత్తం కావాలి. ఇప్పటికే టెన్త్ స్టూడెంట్ చనిపోవడంతో స్థానికులు భయంతో వణుకుతున్నారు. పారిశుధ్యం మెరుగుకు వారం పాటు ప్రత్యేక చర్యలు చేపట్టాలి.
– మిట్టపెల్లి మహేందర్,
కేసీఆర్‌కాలనీ, గోదావరిఖని

దోమలతో నరకం