
విద్యార్థులకు రోబోటిక్స్ శిక్షణ
పెద్దపల్లిరూరల్/రామగుండం/కమాన్‌పూర్: జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో 8,9వ తరగతుల విద్యార్థులకు గురువారం సోహం అకాడమీ ఆఫ్ హ్యుమన్ ఎక్సలెన్స్ సంస్థ ఆధ్వర్యంలో రోబోటిక్స్ శిక్షణ ప్రారంభించారు. పెద్దపల్లిలోని జిల్లా పరిషత్ (బాలుర)ఉన్నత పాఠశాల, రామగుండం పరిధిలోని లింగాపూర్ ఆదర్శ విద్యాలయం, కమాన్‌పూర్ జెడ్పీ స్కూల్‌లో ఆధునిక సాంకేతికతపై అవగాహన కల్పించారు. పాఠశాలకు రోబోటిక్ కిట్ అందించి విద్యార్థులు ఆధునిక సాంకేతికతపై ఆవిష్కరణలు చేసేలా ఆసక్తి పెంపొందిస్తున్నారని జెడ్పీహెచ్‌ఎస్ ఇన్‌చార్జి హెచ్‌ఎం సురేంద్రప్రసాద్, ఎంఈవో సురేందర్‌కుమార్ తెలిపారు. శిక్షణకు లింగాపూర్ ఆదర్శ విద్యాలయం నుంచి 35 మందిని ఎంపిక చేసినట్లు ప్రిన్సిపాల్ సదానందం వివరించారు. కమాన్‌పూర్ జెడ్పీ స్కూల్ నుంచి 21 మంది విద్యార్థులు ఎంపికై నట్లు ఎంఈవో విజయ్‌కుమార్ పేర్కొన్నారు.
విమానాశ్రయం ఏర్పాటు చేయాలని వినతి
గోదావరిఖని(రామగుండం): అంతర్గాం మండలంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ కోరారు. గురువారం పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడుకు వినతిపత్రం అందజేశారు. పెద్దపల్లి జిల్లా భౌగోళికం, పరిశ్రమలు, జనాభా వృద్ధి, రవాణా అవసరాలు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని విమానశ్రయం ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. సాంకేతిక పరిశీలనల అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని వివరించారు.
శిక్షణను వినియోగించుకోవాలి
సుల్తానాబాద్(పెద్దపల్లి): అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్షకు హాజరుకానున్న న్యాయవాదులు రెండునెలల ఉచిత ఆన్‌లైన్ శిక్షణను వినియోగించుకోవాలని లీగల్‌సెల్ కన్వీనర్ వరలక్ష్మి కోరారు. గురువారం మండలకేంద్రంలోని కోర్టు ఆవరణలో ఉచిత శిక్షణ పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. ఆసక్తిగలవారు ప్రోగ్రాం కో ఆర్డినేటర్ అభిలాష్ ఆశ్రిత్ (91330 35555)ను సంప్రదించాలన్నారు. తెలంగాణ బార్ కౌన్సిల్ గుర్తింపు కార్డుతో ఈ నెల 10 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మేకల తిరుపతిరెడ్డి, జనరల్ సెక్రటరీ బోయిని భూమయ్య న్యాయవాదులు పాల్గొన్నారు.
చేనేతరంగాన్ని బలోపేతం చేద్దాం
పెద్దపల్లిరూరల్: చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అదనపు కలెక్టర్ వేణు అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కొండ లక్ష్మణ్‌బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టరేట్ నుంచి ప్రధాన ద్వారం వరకు చేనేత కార్మికులతో కలిసి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ అవార్డు గ్రహీతలను సత్కరించారు. వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ప్రభుత్వ సంస్థల్లో వినియోగించే విద్యార్థుల యూనిఫాం, మహిళా సంఘాలకు అందించే చీరలు తయారీకి నేతన్నలకే ఆర్డర్ ఇచ్చినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు. జెడ్పీసీఈవో నరేందర్, హౌజింగ్ పీడీ రాజేశ్వర్, డీఎంవో ప్రవీణ్‌రెడ్డి తదితరులున్నారు.

విద్యార్థులకు రోబోటిక్స్ శిక్షణ

విద్యార్థులకు రోబోటిక్స్ శిక్షణ

విద్యార్థులకు రోబోటిక్స్ శిక్షణ