
టెండర్లలో పాల్గొనాల్సిందే..
సింగరేణిలో చాలా బొగ్గు గనులు మూతపడే స్థితికి చేరాయి. ప్రస్తుత కార్మికులతోపాటు మరోతరానికి ఇందులో ఉపాధి కల్పించేలా చూడాలి. అందుకే కొత్త బొగు ్గగనులు తప్పనిసరి. ఇందుకోసం సింగరేణి వేలంలో పాల్గొనాల్సిందే. ఈ విషయంపై గనుల శాఖ మంత్రి భట్టి విక్రయార్కకు ఇటీవల మేం లేఖ అందజేశాం.
– వాసిరెడ్డి సీతారామయ్య, అధ్యక్షుడు, ఏఐటీయూసీ
సంస్థ భవిష్యత్ కోసమే..
కొత్తగనులు రావాలంటే టెండర్లలో పాల్గొనాల్సిందే. దీనికి కేంద్రప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. సింగరేణి భవిష్యత్ కోసం కొత్తగనులు తప్పనిసరి. ఈవిషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని కేంద్రంతో మాట్లాడాలి. లేకుంటే వేలాది మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుంది. భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుంది.
– జనక్‌ప్రసాద్, సెక్రటరీ జనరల్, ఐఎన్‌టీయూసీ

టెండర్లలో పాల్గొనాల్సిందే..