శరన్నవరాత్రులకు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

శరన్నవరాత్రులకు సర్వం సిద్ధం

Oct 10 2026 12:46 AM | Updated on Oct 10 2026 12:46 AM

పాలకొండ: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పాలకొండ కోటదుర్గమ్మ వారి శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం చేశారు. ఏటా 9 రోజుల పాటు ఉత్సవాల నిర్వహణ, అమ్మవారు పలు రూపాల్లో భక్తులకు దర్శనం ఉంటుంది. ఉమ్మడి విజయనగరం జిల్లాతో పాటు శ్రీకాకుళం తదితర ప్రాంతాల భక్తులు అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొని మొక్కులు తీర్చుకుంటారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తిచేశారు.

11న అమ్మవారి నిజరూప దర్శనం

ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే అమ్మవారి నిజరూప దర్శనం భక్తులకు కలుగుతుంది. ఈ దర్శనం కోసం వేలాదిగా భక్తులు తరలివస్తారు. ఈ ఏడాది 11 నుంచి అమ్మవారి నిజరూప దర్శన భాగ్యం కలగనుంది.

గట్టి పోలీస్‌ బందోబస్తు..

దసరా ఉత్సవాల నిర్వహణకు సుమారుగా 220 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు డీఎస్పీ ఎం.రాంబాబు తెలిపారు. ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు, 8 మంది ఎస్సైల ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ తొమ్మిది రోజుల పాటు వన్‌ వే ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని వివరించారు.

100 మందితో పారిశుద్ధ్య పనులు

అమ్మవారి ఉత్సవాల నేపథ్యంలో 100 మంది పారిశుద్ధ్య, మెప్మా సిబ్బందితో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు నగర పంచాయతీ కమిషనర్‌ నూకరాజు తెలిపారు. ప్రతిరోజు పారిశుద్ధ్య పనులు, తాగునీరు పంపిణీ, ఆలయ ఆవరణలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.

దేవాదాయ శాఖ

నుంచి రూ.25

లక్షలు

దసరా ఉత్సవాల నిర్వహణకు దేవదాయ శాఖ నుంచి రూ.25 లక్షల వరకు నిధులు ఖర్చు చేస్తున్నట్లు ఈఓ వి.వి.సూర్యనారాణ తెలిపారు. భక్తుల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు నిర్వహణ, తాగునీరు, క్యూలైన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

పక్కాగా ఉత్సవాల నిర్వహణ: సబ్‌ కలెక్టర్‌

దసరా ఉత్సవాల నిర్వహణ ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని సబ్‌ కలెక్టర్‌ పవర్‌ స్వప్నిల్‌ తెలిపారు. శుక్రవారం ఉత్సవ ఏర్పాట్లు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశమై ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్షించారు. మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. తాగునీరు అందుటులో ఉంచాలని, క్యూలైన్లు పక్కాగా ఏర్పాటు చేయాలని తెలిపారు. విద్యుత్‌ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఏఈ యోగికి ఆదేశించారు.

ఏర్పాట్లు పరిశీలించిన సబ్‌ కలెక్టర్‌, డీస్పీలు

ఉత్సవాలు ఘనంగా

నిర్వహించాలని ఆదేశాలు

కోటదుర్గమ్మ వారి నిజరూప దర్శనం రేపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement