మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో సంక్షేమం అంటే వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి, మోసం అంటే చంద్రబాబు అనే అభిప్రాయం ఉందన్నారు. కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలను నిలిపివేయకుండా ప్రజలకు అందించిన ఘనత గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానిదని స్పష్టంచేశారు. మహిళలు, రైతులకు ఇబ్బందులు కలగకుండా పాలన సాగించామని, ప్రస్తుత ప్రభుత్వం మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. మండలంలో 1500 మంది క్రియాశీలక కార్యకర్తలకు గుర్తింపు కార్డులను అందిస్తామని చెప్పారు.


