చిన్నారికి తప్పిన ప్రాణాప్రాయం | - | Sakshi
Sakshi News home page

చిన్నారికి తప్పిన ప్రాణాప్రాయం

Oct 10 2026 12:46 AM | Updated on Oct 10 2026 12:46 AM

పాలకొండ: నేలబావిలో పడిన ఓ చిన్నారి అదృష్టవశాత్తు ప్రాణాప్రాయం నుంచి బయటపడింది. పాలకొండ పట్టణంలో శుక్రవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన భోగి గణేష్‌ దంపతులు విశాఖపట్నంలో నివాసం ఉంటున్నారు. తన భార్య తల్లితండ్రులు పాలకొండలోని చిన్నబల్లంకి వీధిలో నివాసం ఉంటున్నారు. దసరా పండగ నేపథ్యంలో గణేష్‌ భార్య తన మూడేళ్ల కుమార్తె లహరిని తీసుకుని వచ్చింది. అమ్మవారి మొక్కు ఉన్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం భవానీ మాల వేసుకుంది. తాతగారి ఇంటి వద్ద ఉన్న చిన్నారి లహరి నిరుపయోగంగా ఇంటి సమీపంలో ఉన్న నేల బావి వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. బావి సుమారు 12 అడుగుల లోతులో ఉన్నా నీరు లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. స్థానికులు గుర్తించి వెంటనే అగ్నిపమాక శాఖకు సమాచారం అందించారు. తక్షణమే అగ్నిమాపక శాఖ అధికారి జామి సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది వచ్చి బావిలో దిగి చిన్నారిని బయటకు తీయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చిన్నారిని రక్షించిన అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement