న్యూస్‌రీల్
నేడు ఐటీడీఏ పాలకవర్గ భేటీ..
ఉద్యోగాలు.. బ్యాక్‌లాగ్ పోస్టులు.. ప్రత్యేక డీఎస్సీపై ఆశలు
గిరిజన సమస్యలు, నిధులపై సమగ్ర చర్చ జరగాలి
–8లో
గురువారం శ్రీ 8 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
గిరిజన గోడు..
కంటిచూపు లేకపోతే అంధకారమే..!
మనిషి జీవితంలో అత్యంత అమూల్యమైన వరం కంటి చూపు. కంటి సంరక్షణ సైతం అంతే ప్రధానం.
పవర్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మంటలు
పాలకొండ మండలం నవగాం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో మంగళవారం రాత్రి మంటలు చెలరేగాయి.
టీటీడీకి పంపిన జీడిపప్పు వెనక్కి వచ్చిన వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలి. ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో దీనిపై చర్చించి చర్య లు తీసుకోవాలి. నాణ్యత ప్రమాణాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అధికా రుల పర్యవేక్షణలో ఏమైనా లోపాలు లేదా అక్రమాలు జరిగాయా అనే కోణంలో కూడా విచార ణ జరపాల్సిన అవసరం ఉంది. జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్‌లో పనిచేస్తున్న గిరిజన యువతులకు రోజుకు రూ.200 నుంచి రూ. 250 వరకు మాత్రమే కూలి చెల్లిస్తున్నారు. కష్టపడి పనిచేస్తున్న కార్మికులకు న్యాయమైన వేత నం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఆ మేరకు సమావేశంలో చర్చించాలి.
– పల్ల సురేష్, గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షుడు
పార్వతీపురం రూరల్: రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం అక్టోబర్ 8, 9 తేదీ ల్లో పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించనున్నట్లు కమిషన్ కార్యదర్శి ఎస్.చిన్నరాము డు ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 8న ఉదయం 10 గంటలకు ఆయన భామిని మండల రెవెన్యూ కార్యాలయానికి చేరుకుంటారు. స్థానిక తలడ గ్రామానికి చెందిన దారా విజయ ఇచ్చిన అర్జీ మేరకు వంశధార కెనాల్ ప్రాజెక్టుపై జాయింట్ ఇన్‌న్‌స్పెక్షన్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ఎస్సీ బాధితులు, ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. సాయంత్రం 4 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి, పాలకొండ చేరుకుని రాత్రి బస చేస్తారు. అక్టోబర్ 9న ఉదయం 10 గంటల నుంచి పాలకొండ మండలంలోని ఎస్సీ కాలనీల్లో పర్యటించి ప్రజల సమస్యలను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి వీరఘట్టం మండలంలోని ఎస్సీ వీధులను సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమవుతారు.
పాలకొండ: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పాలకొండ కోటదుర్గమ్మవారి హుండీల ఆదాయా న్ని బుధవారం లెక్కించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వి.వి.సూర్యనారాయణ, జగ న్నాథస్వామి ఆలయ ఈఓ పరమేశ్వరి ఆధ్వర్యంలో ఉదయం హుండీల తెరచి లెక్కింపు చేపట్టారు. ఆగస్టు 10 నుంచి నేటి వరకు 59 రోజులకు హుండీల ద్వారా రూ.7,87,679 ఆదాయం సమకూరిందని ఈఓ తెలిపారు. ఆదాచాపికప ఆలయ బ్యాంకు ఖాతాలో జమచేసినట్టు వెల్లడించారు.
పార్వతీపురం: ధాన్యం సేకరణలో ఎలాంటి జా ప్యం లేకుండా అధికారులు, బ్యాంకర్లు, రైస్ మిల్లర్లు సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ ఆర్.వైశాలి ఆదేశించారు. రైస్ మిల్లర్లు, బ్యాంక్ ప్రతినిధులతో బుధవా రం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. అర్హులైన రైస్ మిల్లర్లకు ఈ– బ్యాంక్ గ్యారెంటీలు త్వరగా మంజూరు చేయా లని బ్యాంకర్లను ఆదేశించారు. రైతుల నుంచి ధాన్యం స్వీకరించేందుకు మిల్లులు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని సూచించారు. సమావేశంలో సివిల్ సప్‌లై అధికారులు, లీడ్ బ్యాంకు ప్రతినిధులు, జిల్లా వ్యవసాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
బొబ్బిలి: గ్రోత్‌సెంటర్‌లోని బెర్రీ ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమలో మంగళవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ప్రమాద కారణాలు, రక్షణ చర్యలను తెలుసుకునేందుకు వివిధ శాఖల అధికారులు పరిశ్రమను బుధవారం పరిశీలించారు. కార్మిక భద్రతా లోపాలను గుర్తించారు. పరిశీలించిన వారిలో ఇన్‌చార్జి తహసీల్దార్ తొగురు సుబ్బారావు, ఆర్‌ఐ రామ్‌కుమార్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఉన్నారు.
సాక్షి, పార్వతీపురం మన్యం:
గిరిజన ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమానికి కీలక వేదికగా భావించే పార్వతీపురం ఐటీడీఏ పాలకవర్గ సమావేశం ఎన్నో ఏళ్ల తర్వాత గురువారం జరగనుంది. ప్రతి మూడు నెలలకోసారి సమావేశాలు జరగాల్సి ఉన్నా ఆ ఊసేలేదు. దానివల్ల ఐటీడీఏలోని లోపాలు, అవినీతి అక్రమాలకు అడ్డులేకుండా పోయింది. గిరిజన సంక్షేమానికి ఖర్చు చేయాల్సిన నిధులు పక్కదారి పడుతున్నాయి. ప్రతి పనికీ కమీషన్లు ఇక్కడ సర్వసాధారమయ్యాయి. ఈ సమావేశంపై గిరిజన వర్గాల్లో భారీ ఆశలు నెలకొన్నాయి. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ, ఉపాధి, విద్య, వైద్యం, మౌలిక వసతులు, భూ సమస్యలకు పరిష్కారం చూపే దిశగా సమావేశంలో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి. ముఖ్యంగా గిరిజన నిరుద్యోగులకు ప్రత్యేక డీఎస్సీ, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ, ట్రైకార్ రుణాల మంజూరు, ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్‌ఎంల నియామకం వంటి అంశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఐటీడీఏ పరిధిలోని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గిరిజనుల బ్యాక్‌లాగ్ పోస్టులను గుర్తించి ప్రత్యేక నియామక ప్రక్రియ ద్వారా భర్తీ చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. రాబోయే డీఎస్సీ నోటిఫికేషన్‌లో గిరిజన నిరుద్యోగులకు ప్రత్యేక అవకాశాలు కల్పించాలని, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలని కోరుతున్నారు. జీవో 3 అమలు విషయంలో ఏర్పడిన న్యాయపరమైన పరిస్థితులకు చట్టబద్ధమైన పరిష్కారం చూపి, ప్రత్యేక నియామక ప్రక్రియకు మార్గం సుగమం చేయాలని కూడా గిరిజన సంఘాలు కోరుతున్నాయి.
గిరిజన విద్యార్థుల ఆరోగ్యం మరో ప్రధాన అంశంగా మారింది. ఏటా పదుల సంఖ్యలో గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారు. వారికి నాణ్యమైన ఆహారం అందడం లేదు. సరైన మౌలిక వసతులు సమకూరడం లేదు. విద్యార్థుల మరణాలపై మానవతా దృక్పథంతో స్పందించి పరిహారం అందించే చర్యలు ఈ ప్రభుత్వంలో కానరావడం లేదు. సాంఘిక సంక్షేమశాఖలో విద్యార్థి మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు ‘సాంత్వన’ పథకాన్ని అమలు చేస్తున్నారు. గిరిజన సంక్షేమశాఖలో ఆ పరిస్థితి లేదు. ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఏఎన్‌ఎం పోస్టులను భర్తీ చేసి, విద్యార్థులకు నిరంతర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ఉంది. గతంలో చోటుచేసుకు న్న విద్యార్థుల మరణాలపై సమగ్ర విచారణ జరిపి, బాధిత కుటుంబాలకు తగిన పరిహారం అందించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు ఆరోగ్య పరిరక్ష ణ వ్యవస్థను బలోపేతం చేయాలని కోరుతున్నారు.
●విద్యా ప్రమాణాల మెరుగుదలతో పాటు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో స్థానిక గిరిజన విద్యార్థుల భాషా అవసరాలకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలనే అంశం కూడా సమావేశం ముందుకు రావాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి.
గిరిజన యువతకు స్వయం ఉపా ధి కల్పించడంలో కీలకమైన ట్రైకా ర్ రుణాల మంజూరుపైనా సమావేశంలో సమగ్ర చర్చ జరగాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అర్హులైన గిరిజనులకు రుణాలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు, గరిష్ఠంగా 90 శాతం వరకు రుణ సదుపాయం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఉంది. గత ఏడాది ఐటీడీఏకు వచ్చిన నిధులు, ఖర్చు చేసిన మొత్తం, మిగిలిన నిధులు, గిరిజన సమగ్ర అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలపై పూర్తి నివేదికను సమావేశంలో బహిర్గతం చేయాలన్న వాదన వినిపిస్తోంది. గతంలో గిరిజనుల అవసరాలకు అనుగుణంగా ఐటీడీఏలో ట్రైకార్ నిధులను వెచ్చించేవారు. కొన్నేళ్లుగా అధికారులు కమీషన్ల వలలో పడి ఇష్టారీతిన పరికరాలు కొనుగోలు చేస్తున్నారు. ట్రాక్టర్లు, చేపల వలలు, ఇతర సామగ్రి కొనుగోలుపై ఆయా వర్గాల నుంచి తీవ్ర అసంతృప్తి ఉంది.
యువతను పోటీ పరీక్షలకు సిద్ధం చేయడానికి ఐటీడీఏ పరిధిలో గిరిజన స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, డీఎస్సీ, పోలీస్ తదితర పోటీ పరీక్షలకు ఉచిత నాణ్యమైన కోచింగ్ అందిస్తే గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని సంఘాలు పేర్కొంటున్నాయి. ఐటీడీఏ పరిధిలోని గిరిజనుల జీవన ప్రమాణాల మెరుగుదలకు గత ఏడాది వివిధ శాఖలు చేపట్టిన కార్యక్రమాలు, ఖర్చు చేసిన నిధులు, సాధించిన ఫలితాలపై సమగ్ర నివేదికను సమావేశంలో ప్రవేశపెట్టాలని డిమాండ్ ఉంది. ప్రతి ఏడాది షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలన, గిరిజన సంక్షేమంపై వార్షిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించే విధానం తీసుకురావాలని కూడా కోరుతున్నారు. ఉద్యోగం నుంచి ఉపాధి వరకు.. విద్య నుంచి వైద్యం వరకు.. భూమి నుంచి మౌలిక వసతుల వరకు గిరిజన ప్రాంతాల సమస్యలపై ఐటీడీఏ పాలకవర్గ సమావేశం ఏ మేరకు నిర్ణయాలు తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు తీర్మానాలకే పరిమితం కాకుండా కార్యాచరణకు మార్గం చూపుతుందా అన్నది గిరిజన వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ ప్రభాకరరెడ్డి
పార్వతీపురం: జిల్లాలో డోలీ బాధిత గ్రామాల రోడ్ల నిర్మాణ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాల ని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో పంచాయతీరా జ్, ఐటీడీఏ శాఖల అధికారులతో రోడ్ల నిర్మాణ పనులపై బుధవారం సమీక్షించారు. ఉపాధిహామీ నిధులతో రోడ్ల పనులకు ప్రాధాన్యం కల్పించాలన్నారు. పనుల్లో జాప్యం చేసే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుని, సామర్ధ్యం ఉన్నవారికే పనులు అప్పగించాలని సూచించారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, అధికారులు క్షేత్రస్థాయిలో పనులు పర్యవేక్షించాలని ఆదేశించారు. సమావేశంలో డ్వామా పీడీ కె.రామచంద్రరావు, పీఆర్, ఐటీడీఏ అధికారులు పాల్గొన్నారు.
ప్రశాంత ఎన్నికలే లక్ష్యం..
స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, సమర్ధవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి అధికారులతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. స్ట్రాంగ్ రూమ్‌లు, రూట్ మ్యాప్‌లు, వాహనాలు, జోనల్, రూట్ అధికారుల నియామకంతో పాటు సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాలను గుర్తించి వివరాలను పోలీస్ అధికారులకు అందించాలని సూచించారు. ఎన్నికల సిబ్బందికి ముందస్తుగా నియామక ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల విధులకు అవసరమైన సిబ్బంది నియామకానికి సంబంధించిన వివరాలను ముందుగా అందజేయాలని కోరారు.
ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమం, విద్య, ఉపాధి, మౌలిక సదుపాయాలు, ఐటీడీఏ నిధుల వినియోగంపై సమగ్రంగా చర్చించి, పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపాలని గిరిజన సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తోంది. గిరిజన విద్యార్థుల మరణాలపై సమగ్ర విచారణ జరిపి బాధిత కుటుంబాలకు తగిన పరిహారం అందించాలి.
– తాడంగి సాయిబాబు/పాలక రంజిత్‌కుమార్,
గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు
పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన గ్రామాల్లో రహదారులు, తాగునీరు, విద్యుత్, రవాణా, అంగన్‌వాడీ భవనాలు, వైద్య సదుపాయాలు వంటి ప్రాథమిక వసతుల సమస్య తీవ్రంగా ఉంది. వీటి కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి. అవసరమైన ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిధులు కేటాయించి పనులు చేపట్టాలని ఆశిస్తున్నారు. మరోవైపు షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజనుల భూముల రక్షణ అంశం కూడా కీలకంగా మారింది. ఎల్‌టీఆర్‌కు సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులను సమర్థవంతంగా అమలు చేసి గిరిజన భూముల ఆక్రమణలను అడ్డుకోవాలన్న డిమాండ్ ఉంది. ఎల్‌టీఆర్‌ను నిర్వీర్యం చేసే ప్రయత్నాలపై న్యాయపరంగా అనుబంధ పిటిషన్లు దాఖలు చేసి గిరిజనుల భూహక్కులను కాపాడాలని కోరుతున్నారు.
ఐటీడీఏ పరిధిలో 54 వన్‌దన్ వికాస కేంద్రాలను (వీడీవీకేలు) ఏర్పాటు చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు నిధులు అందించారు. ఇక్కడ అవినీతి రాజ్యమేలింది. కమీషన్లకు కక్కుర్తి పడి, పనికిరాని యంత్రాలను కొనుగోలు చేశారు. దీనివల్ల కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణలు ఉన్నాయి.
పార్వతీపురం కేంద్ర వ్యవసాయ మార్కెట్ యార్డులో నడుస్తున్న జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్‌కు సంబంధించి నాణ్యత ప్రమాణాలు, ప్రాసెసింగ్ విధానం, ప్యాకింగ్, సరఫరా తదితర అంశాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానానికి కోట్ల రూపాయల విలువ చేసే జీడిపప్పు ఇక్కడ నుంచి పంపగా.. నాణ్యత లేదన్న కారణంతో అది వెనక్కి వచ్చేసింది. ఈ వ్యవహారంపై పాలకవర్గ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. జీడిపప్పు ప్రాసెసింగ్ కేంద్రాల్లో నిల్వలు, నాణ్యత, ప్యాకింగ్ విధానం, సరఫరా చేస్తున్న సంస్థలు, ప్రభుత్వ నిబంధనల అమలు తదితర అంశాలపై అధికారులు పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించాలి.


