సాక్షి, పార్వతీపురం మన్యం: నూతన ఎక్సైజ్ పాలసీ 2026–27లో భాగంగా జిల్లాలో రెన్యువల్ కాక.. మిగిలిపోయిన తొమ్మిది మద్యం దుకాణాలకు నిర్ణీ త గడువు ముగిసేలాగా 45 దరఖాస్తులు వచ్చాయి. వీటికి సంబంధించి దుకాణాల కేటాయింపునకు గురువారం ఉదయం 8 గంటలకు కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ సమావేశ మంది రంలో కలెక్టర్ ప్రభాకర రెడ్డి సమక్షంలో లాటరీ తీయనున్నారు. ఒక్కో దుకాణానికి సగటున నాలుగు నుంచి 8 వర కు దరఖాస్తులు అందా యి. వీటి ద్వారా ప్రాసెసింగ్ ఫీజు కింద రూ. 45 వేలు, దరఖాస్తు రుసుము కింద రూ. 1.35 కోట్లు ప్రభుత్వానికి ఆదా యం రూపంలో లభించింది. అందిన దరఖాస్తులు ఆధారంగా.. నిబంధనల ప్రకారం దుకాణాల కేటాయింపు ఉంటుందని జిల్లా ప్రొవిబిషన్, ఎక్సైజ్ అధికా రి కె.సహదేవ తెలిపారు. అయితే, కొన్ని దుకాణాల కు అధికారపార్టీ నాయకు లు సిండికేట్‌గా మారి తక్కువ దరఖాస్తులు వేయించి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టినట్టు సమాచారం.


