సీతంపేట: ఏజెన్సీ చిన్నారులపై మృత్యుపంజా శీర్షికన సాక్షిలో బుధవారం ప్రచురితమైన కథనంపై సంబంధిత అధికారులు స్పందించారు. ఈమేరకు ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్‌వో విజయపార్వతి, సీడీపీఓ బి.సిమ్మాలమ్మతో పాటు వైద్యసిబ్బంది చిన్నకంబ, వంబరెల్లి గ్రామాల్లో ఇటీవల మృతిచెందిన ఇద్దరు చిన్నారుల కుటుంబాల వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. ఇద్దరు చిన్నారుల పోషకస్థితి సంబంధిత రికార్డుల్లో నార్మల్‌గా నమోదు చేశారని, రక్తహీనత లేదన్నారు. ఒక చిన్నారికి బ్లడ్ ఇన్‌ఫెక్షన్, జ్వరం కారణంగా చికిత్స అందించామన్నారు. మరొకరికి యాస్పిరేషన్, న్యుమేనియా చికిత్స అందజేశారని, వైద్యశాఖలో నమోదైన మరణానికి కూడా ఇవే కారణాలని పేర్కొన్నారు.


